- అధికారుల పర్యవేక్షణపై గ్రామస్థుల ప్రశ్నలు
- నిర్మాణాల వైపు కన్నెత్తి చూడని వైనం
- సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న అధికారులు
Constructions without permits : హనుమకొండ జిల్లా దామెర మండలం దామెర గ్రామ శివారులోని సర్వే నంబర్ 306లో జరుగుతున్న నిర్మాణాలపై సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సమాచారం కోరిన అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల నుండి పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఆర్టీఐ ద్వారా కోరిన సమాచారం ప్రకారం, సంబంధిత శాఖల నుంచి నిర్మాణ అనుమతులు, భూ వినియోగ మార్పు (నాలా) అనుమతులు, ఇతర అవసరమైన అనుమతులకు సంబంధించిన వివరాలపై స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. దరఖాస్తుదారు సమాచారం కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, పూర్తి సమాచారం అందలేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మొదటి అప్పీల్, అనంతరం రాష్ట్ర సమాచార కమిషన్ను ఆశ్రయించనున్నట్లు సమాచారం.
ఆర్టీఐ ద్వారా లభించిన పత్రాలు, స్థల ఫోటోలు మరియు ఇతర అధికారిక రికార్డుల ఆధారంగా సంబంధిత శాఖలు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా అనే అంశాన్ని నిర్ధారించాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూడక పోవడం పై ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై సంబంధిత రెవెన్యూ, గ్రామపంచాయతీ,కుడా అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టి అక్రమ నిబంధాలపై శాఖ పరమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
