- మా అయ్య యాది సభకు ఆత్మీయ పిలుపు
‘Bahujana Yadi’ Meeting Today in Chityala
కులమతాల కట్టుబాట్లకు లొంగని మనసు…
మంచితనమే మతంగా బతికిన మా అయ్య మంచి మనసు…
కష్టం నమ్ముకుని…
చెమట చిందించి…
ఐదుగురు కొడుకుల బతుకులు నిలబెట్టి,
మంచి దారులు చూపించిన మనిషి…
మమ్మల్ని చదివించి… ఎదిగించి…
సమాజం కోసం నిలబడే ఉద్యమకారులుగా, ఉద్యోగస్తులుగా…
రాసే రచయితలుగా తీర్చిదిద్దిన మా అయ్య…
ఆయన బతుకు మాకు బాట…
ఆయన మాట మాకు పాట…
దేహంగా దూరమైనా… యాదగా మాతోనే ఉంటూ…
మా గుండెల్లో వెలుగై,
మా అడుగుల్లో అడుగై నిలిచిన మా అయ్యకు…
దశదినకర్మ సందర్భంగా 11-09-2026న నిర్వహించే యాది సభకు బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు,
కవులు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు అందరూ రావాలి…
మా అయ్య యాదిని పంచుకోవాలి…
ఆయనకు ఘనమైన నివాళి అర్పించాలి.
మా అయ్య యాది…
మా బతుకుకు బడి,
ఆయన చూపిన బాట…
మా జీవితానికి తోవ!
మా కుటుంబ సభ్యుల తరఫున ఆత్మీయ ఆహ్వానం
