Man dies in road accident రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన కిన్నెర అభిలాష్ (31) ఒగ్లాపూర్ గ్రామ బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ప్రమాదానికి గురయ్యాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు నడిపిన వ్యక్తి శాయంపేట మండలం గంగిరేగిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు విషాదంలో మునిగిపోయారు.
