- ఎద్దును ఢీకొని బోల్తాపడిన ఆటో.. ఒకరికి తీవ్ర గాయాలు
జన నిర్ణయం / గణపురం :
Road accident near Burrakayalagudem రాఖీ పండుగ సందర్భంగా కాకర్లపల్లి నుంచి గణపురం వైపు వెళ్తున్న ఆటో బుర్రకాయలగూడెం వద్ద రోడ్డుపై వెళ్తున్న ఎద్దును ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మేకల అనూష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎడమ కాలు విరిగినట్లు సమాచారం.
ప్రమాదం సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 వాహనంలో భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈఎంటీ శ్వేత, వాహన సిబ్బంది రషీద్ క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించడంలో సేవలందించారు.
