- సంగెం ఎస్సీ కాలనీలో కర్రల సహాయంతో కరెంట్ వైర్లు..
- కోతులు ఊగినా తెగుతున్న లైన్లు..!
- ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని 10 కుటుంబాల భయం.!!
జన నిర్ణయం / సంగెం, జులై 25 :
Lives hanging by a thread Lives lived in darkness.!? అధికారుల నిర్లక్ష్యపు సమాధానాలు, వింత నిబంధనలు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన 10 నిరుపేద కుటుంబాలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. కాలనీలో విద్యుత్ స్తంభాలు స్పష్టంగా కళ్లముందే కనిపిస్తున్నప్పటికీ, వాటికి వైర్లు వేసి అధికారికంగా కనెక్షన్ ఇవ్వడానికి అధికారులు మొండిగా నిరాకరిస్తున్నారు. ఫలితంగా నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి దాపురించిందని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Lives hanging by a thread… Lives lived in darkness…!?
ఉన్న మీటర్లు పక్కనపెట్టి.. కొత్త మీటర్లు కొనాలంట..!
గతంలో ఈ పాత స్తంభాల ద్వారానే కాలనీవాసులకు విద్యుత్ సరఫరా అయ్యేది. అయితే ఆ తర్వాత సాంకేతిక కారణాలతో దాన్ని తొలగించారని, ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని అధికారులు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Lives hanging by a thread… Lives lived in darkness…!?
అధికారుల తీరుపై బాధితుల ఆగ్రహం
“మాకు ఇప్పటికే అధికారికంగా విద్యుత్ మీటర్లు ఉన్నాయి. క్రమం తప్పకుండా బిల్లులు కూడా వస్తాయి. కానీ అధికారులు మాత్రం ‘ఈ సమస్యకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు లేవు, కొత్తగా మరో మీటర్ కోసం అప్లై చేసుకుంటేనే స్తంభాలు సరిచేసి లైన్ ఇస్తాం’ అని దారుణమైన కొర్రీలు పెడుతున్నారు. ఉన్న మీటర్లకు లైన్ ఇవ్వకుండా, మళ్లీ కొత్త మీటర్లు తీసుకోమనడం ఏ రకమైన న్యాయం..?”
Lives hanging by a thread…Lives lived in darkness…!?
కర్రల సహాయంతో కరెంట్ సరఫరా.. క్షణక్షణం భయం భయం..!
అధికారుల వైఖరితో వేరే దారిలేక బాధితులు మెయిన్ లైన్ నుంచి తమ ఇళ్లకు దాదాపు రెండు స్తంభాల దూరానికి కర్రల ఆసరాగా ప్రమాదకర రీతిలో వైర్లు లాక్కున్నారు. ఈ తాత్కాలిక వైర్లు ప్రస్తుతం కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పైనుంచే వెళ్తున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, కంకర (గ్రావెల్) తెచ్చే లారీలు, ట్రాక్టర్లు వచ్చిన ప్రతిసారీ ఈ వైర్లను పదే పదే తీయడం, మళ్లీ కట్టడం చేస్తున్నారు. ఏ క్షణంలో వైర్లు తెగి హై-వోల్టేజ్ కరెంట్ షాక్ తగులుతుందోనని భవన నిర్మాణ కార్మికులు, యజమానులు వణికిపోతున్నారు.
Lives hanging by a thread…Lives lived in darkness…!?
కోతులు ఊగినా తెగుతున్న వైర్లు.. రాత్రి వేళల్లో పాముల భయం..!
ఈ వైర్లు ఎంత బలహీనంగా ఉండి వేలాడుతున్నాయంటే.. కొద్దిగా గాలి వీచినా, లేదా ఆ ప్రాంతంలో తిరిగే కోతులు ఆ వైర్లపైకి వచ్చి వాలినా, ఊగినా సరే కరెంట్ వైర్లు తెగి సరుక్కున కింద పడిపోతున్నాయి. ఏ క్షణంలో ఎవరిపై ఈ లైవ్ వైర్లు పడి ప్రాణాపాయం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో సరైన విద్యుత్ సరఫరా లేక కాలనీ అంధకారంలో మునిగిపోతోంది. ఇళ్ల చుట్టూ చీకటిగా ఉండటంతో లోపలికి విషపురుగులు, పాములు వస్తున్నాయని.. చిన్న పిల్లలు, వృద్ధులతో ప్రతి రాత్రి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని గడపాల్సి వస్తోందని బాధితులు రోదిస్తున్నారు.
Lives hanging by a thread…Lives lived in darkness…!?
ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి.!
ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, వింత సాకులు చెప్పడం మానుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్న పాత మీటర్లకే స్తంభాల ద్వారా అధికారికంగా లైన్ పునరుద్ధరించి, తమను ప్రమాదాల నుండి, విషపురుగుల భయం నుండి కాపాడాలని 10 కుటుంబాల బాధితులు వేడుకుంటున్నారు.
