Bhashipaka Sadayya appointed as General Secretary of the Sangem Mandal Sarpanches’ Forum సంగెం మండల సర్పంచుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శిగా గ్రామ సర్పంచ్ భాషిపాక సదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో నిర్వహించిన ఫోరం ముఖ్య సమావేశంలో నాయకులు, సర్పంచులు ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సందర్భంగా సదయ్య మాట్లాడుతూ… తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి అందరినీ ఏకతాటిపైకి తెచ్చి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సదయ్యను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
