“Side Effects of Social Media – Prevention” : ఈ సకల సృష్టిలో ఏ జీవరాశికి లేనటువంటి మాట్లాడుకునే గొప్ప లక్షణం మనుషులుగా మనందరం కలిగివున్నాం. బహుశా ఇప్పుడు A. I యుగంలో ఉన్నాం కదా మాట్లాడుకోవం కూడా మర్చిపోతున్నాం. మనిషితో మనిషి మాట్లాడే రోజులు పోయి ఇప్పుడంతా మొబైల్ ఫోన్లతో గడిపేస్తున్నాం. లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మన ధ్యాస అంతా సామాజిక మాధ్యమాల్లోనే. బర్త్ to డెత్, పండగైనా, దుఃఖమైనా సందర్భం ఏదైనా మనుషులను నేరుగా కలిసి చెప్పే పరిస్థితి నుండి మన స్థితిని వాట్సాప్ లో, ఫేస్ బుక్ లో, ఇంస్టాగ్రామ్ లో, పోస్ట్ చేస్తూ మనకు మనమే గొప్పగా ఫీలవుతున్నాం. అసలు మనుషులమనే కనీస స్పృహ కోల్పోయి కృత్రిమత్వంలో తేలిపోతున్నాం. ఒకప్పుడు మనుషులు మధ్య ఉన్న సంబంధాలు, ప్రేమలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. ఉద్యోగం వచ్చినా పెళ్ళి కుదిరినా ఆఖరికి చచ్చిపోయినా అన్ని వాట్సాప్ స్టేటస్ లోనే, నలుగురు కలిసి మంచి చెడులు మాట్లాడుకునే రోజులు నుండి ఇప్పుడు గంటలు గంటలు మొబైల్ ఫోనుకి బానిసగా మారి నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతూ ఏకాంతాన్ని కోరుకుంటున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ సామాజిక మధ్యామాలకి అలవాటుపడిపోయి వాటికే అతుక్కుపోతున్నారు. ప్రస్తుత సమాజంలో మన గుర్తింపు ఆధార్ కార్డుతోనో, ఓటరు కార్డుతోనో కాదు, ఫేసుబుక్ అకౌంట్ తో, ఇంస్టాగ్రామ్ రీల్స్ తో . సామాజిక మధ్యమాలు లేనప్పుడు మన పేరు అవతలి వాళ్ళకి చెప్పడానికి భయపడిపోయే మనం ఇప్పుడు తెరచిన పుస్తకంలాగా నిస్సంకోచంగా , వ్యక్తిగత విషయాల నుండి మొదలు ప్రతి విషయం స్టేటస్ లో పోస్టు చేస్తున్నాం. ఇది ఎంతవరకు సరియైనది మనమే ప్రశ్నించుకోవాలి.
“Side Effects of Social Media – Prevention”
మనుషులు ఈ మధ్యామాలకి ఎంత ప్రభావితమయ్యారంటే చివరికి బాత్రూమ్ లోకి మొబైల్ ఫోను తీసుకెళ్లేంత . సాంకేతిక విజ్ఞానం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది అనుకుంటూ అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం, క్షణాల్లో సమాచారాన్ని తెలుసుకుంటున్నాం కానీ మనల్ని మనమే మర్చిపోతున్నాం అనే విషయం గుర్తుచేసుకోవాలి.bఆకలి వేస్తే ఓపికతో సమయం కేటాయించి హాయిగా భోజనం సిద్ధం చేసుకొని కుటుంబమంతా కూర్చొని తినే రోజుల నుండి స్విగ్గీ, జొమాటోల మీద ఆధారపడే స్థితికి చేరుకున్నాం. ఇంట్లో ఏ శుభాకార్యమైనా ఇంటిల్లిపాది బయటికెళ్లి నచ్చింది కొన్నుకొని ఆనందించే రోజుల నుండి ఏ వస్తువైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని తీసుకుంటున్నాం. ఏదైనా సమస్య వచ్చినా తెలియని విషయం తెలుసుకోవాలని అనుకున్నా పెద్దవాళ్ళనో లేక స్నేహితులనో అడిగి సంప్రదించేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ప్రశ్నకు, ప్రతి సమాచారానికి గూగుల్ మీద ఆధారపడుతున్నాం. ఒకవేళ సమస్య ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉంటే మానసికంగా క్రుంగిపోయి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోడానికి కూడా వెనుకాడడం లేదు. ఈ విపరీతమైన ధోరణికి కారణం మనుషులు మధ్య సరైన సంభాషణ లేకపోవడం.
“Side Effects of Social Media – Prevention”
ఒంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి మాత్రలు తెచ్చుకునే వాళ్ళం, కానీ ఆరోగ్య సమస్యలకు కూడా గూగుల్ నే సంప్రదిస్తున్నాం. అంటే రోజురోజుకి మనుషులుగా ఎదిగి పోతున్నాo అనే భ్రమలో బతుకుతూ ఉన్న మెదడుని కాస్త పనిచేయకుండా చేస్తున్నాం. ఆలోచించండి మనిషికి మనిషికి మధ్య దూరాన్ని మనకు మనమే తెలియకుండా పెంచుకుంటున్నాం. మాధ్యమాల వలలో చిక్కుకొని మన ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం. ఈ పరిస్థితిని నివారించే మార్గాలు పాటిస్తూ సామాజిక మాధ్యమాల వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేద్దాం.
“Side Effects of Social Media – Prevention”
- నివారణ
రోజులో కొంత సమయం మాత్రమే మొబైల్ ఫోనుకి కేటాయించాలి అనే నియమం పెట్టుకోవాలి.bవీలైనప్పుడు స్నేహితులతో నేరుగా కలిసి మాట్లాడండి. పుస్తకాలు, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు చదవండి. ఇష్టమైన వ్యాపకాలు ఉంటే వాటిని మరింత నేర్చుకోండి. నచ్చిన విషయంపై మీకు నచ్చిన వాళ్ళతో చర్చించండి. ఇవన్నీ కాకపోతే ఒక్కసారి నాలుగు కూడళ్ళ దగ్గర నిలబడి బయటి ప్రపంచాన్ని చూడండి. ఓ ఛాయ్ బండి , పండ్ల వ్యాపారి, పూలు అమ్ముకునే ముసలమ్మ , తోపుడు బండిని నెడుతూ అందమైన బొమ్మలు అమ్ముకునే అతన్ని, ట్రాఫిక్ సిగ్నల్ వంక చూస్తూ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడూ పడుతుందా ఇంటికి తొందరగా వెళ్ళాలి అని ఆత్రంగా చూసే ఓ తండ్రిని చూడండి. ఒక్కసారి ఫోను పక్కన పెట్టి మీ కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూడండి. నిత్యం బ్రతకడానికి యుద్ధం చేస్తున్న మనుషులు మీకు కనబడతారు. అప్పుడు అర్ధమవుతుంది “మనుషులకి….. మాధ్యమాలకి ” వ్యత్యాసం. వీలైనంతగా మనుషులతో సాన్నిహిత్యం ఏర్పరచుకోవాలి సమాజిక మాధ్యమాల వాడకం తగ్గించాలి..
తిరుమల మూర్తి M. Sc Psychology కాకతీయ విశ్వ విద్యాలయం
