- SC, జనరల్ స్థానాల్లో BCలకు ‘ఉపసర్పంచ్’ అవకాశం కల్పించాలి
- ఉమ్మడి వరంగల్ జిల్లా ముదిజుల సమన్వయకర్త పల్లెబోయిన సుధాకర్ విజ్ఞప్తి
Neglecting BCs is like ignoring social justice సమాజంలో వెన్నెముకగా ఉన్న బీసీ (BC) వర్గాలను రాజకీయంగా నిర్లక్ష్యం చేయడం అంటే సామాజిక న్యాయాన్ని విస్మరించడమే అవుతుంది. తాజాగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు BCలకు బీసీలకు సముచిత స్థానం కల్పించాలి.
దేశ జనాభాలో 75 శాతం బీసీలు ఉన్నా, వారికి సరైన రాజ్యాధికారం లేకపోవడం శోచనీయం. దేశం సంగతి అటుంచితే నియోజకవర్గాల్లోనూ బీసీలకు సరైన గుర్తింపు లేకుండా పోతుంది. తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ బీసీలు నిర్లక్ష్యం చేయడడ్డారనేది గుర్తించాలి. ఈ నేపథ్యంలో SC మరియు జనరల్ రిజర్వుడ్ స్థానాల్లో ఉపసర్పంచ్ లుగా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం. ఇట్టి అంశాన్ని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సానుకూల దృక్పధంతో చొరవచూపి BCలకు ఉపసర్పంచ్ లుగా అవకాశం కలిగేలా చూడాలి.
Neglecting BCs is like ignoring social justice
ఎందుకంటే ఒకరకంగా BCలను నిర్లక్ష్యం చేస్తే సామాజిక న్యాయాన్ని విస్మరించినట్లే అనేది గుర్తించాలి. గ్రామాల్లో సమన్యాయం, సామాజిక న్యాయం సమానంగా కనిపించేలా సామాజిక అంతరాలు లేకుండా ఉండేలా రాజకీయ సమనత్వం ఉండే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే కోరంతో కూడా నిమిత్తం లేకుండా SC మరియు రిజర్వూడ్ స్థానాల్లో BCలకు ఉపసర్పంచ్ గా అవకాశం కల్పించాలి. జనాభాలో సింహభాగం ఉన్న బీసీలు నేటికీ రాజకీయ ఫలాలకు దూరంగా ఉండటున్న పరిస్థితి ఉంది. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకోకుండా, నిర్ణయాధికారంలో కూడా BCలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది.
Neglecting BCs is like ignoring social justice
ఎస్సీ (SC) మరియు జనరల్ స్థానాలుగా రిజర్వ్ అయిన గ్రామాల్లో ఉపసర్పంచ్ పదవులను తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గాలకే కేటాయించాలి. గ్రామ పాలనలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణనీయమైన జనాభా కలిగిన ముదిరాజ్ వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. “బహుజన వర్గాల ఐక్యతతోనే సామాజిక మార్పు సాధ్యం. బీసీలకు రావలసిన రాజకీయ హక్కులను కాలరాస్తే సామాజిక న్యాయం లేదనట్లే అవుతుంది. ఇలాంటి పరిస్థితిని BCలు ఎట్టి పరిస్థితిలోనూ సహించకూడదు.
Neglecting BCs is like ignoring social justice
రాబోయే mptc, zptc ఎన్నికల్లోనూ బీసీ అభ్యర్థులకు పెద్దపీట వేయాలని, లేనిపక్షంలో సామాజిక సమీకరణాలు దెబ్బతినే అవకాశం ఉంది. తాజాగా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన ఈనెల 22న గ్రామ పాలకవర్గాలు ఏర్పడుతున్న నేపథ్యంలో అవకాశం ఉన్నమేరకు ఎస్సీ (SC) మరియు జనరల్ స్థానాల్లో బీసీ (BC) లకు ఉపసర్పంచ్ లుగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం.
- పల్లెబోయిన సుధాకర్ ముదిరాజుల సమన్వయకర్త ఉమ్మడి వరంగల్ జిల్లా సెల్ : 99492 79802
