దళిత బిడ్డల భవిష్యత్తు కోసం మరింత విస్తృతంగా పనిచేస్తా : భీమ వినయ్ కుమార్
The Dalit Ratna Award has further increased the sense of responsibility : దళిత సమాజ అభ్యున్నతి, దళిత బిడ్డల విద్య, సామాజిక న్యాయం కోసం చేస్తున్న సేవలకు గుర్తింపుగా భీమ వినయ్ కుమార్కు 2026 సంవత్సరపు దళిత రత్న అవార్డు లభించింది. డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో అందజేసిన ఈ పురస్కారాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా భీమ వినయ్ కుమార్ మాట్లాడుతూ, ఈ అవార్డును వ్యక్తిగత గౌరవంగా కాకుండా దళిత సమాజానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. పురస్కారం తన బాధ్యతను తగ్గించలేదని, మరింత పెంచిందని తెలిపారు.
The Dalit Ratna Award has further increased the sense of responsibility
దళిత బిడ్డలకు విద్య, ఉద్యోగాలు, ఆర్థికంగా ఎదగడానికి అండగా నిలవడంతో పాటు, వెనుకబడిన కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం అందిస్తానని చెప్పారు. “ఒంట్లో రక్తం ఉన్నంత వరకు దళిత జాతి, దళిత బిడ్డల కోసం శాయశక్తులా పనిచేస్తా” అని భీమ వినయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పురస్కారం ఆయన సేవలకు గుర్తింపుగా నిలవడమే కాకుండా, భవిష్యత్తులో మరింత విస్తృతంగా ప్రజాసేవ చేయడానికి ప్రేరణగా నిలుస్తుందని పలువురు దళిత సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, యువత అభినందించారు.
