Jail Bharo under the auspices of CITU in Sangem : కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంగెం మండల కేంద్రంలో CITU ఆధ్వర్యంలో జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CITU మండల కన్వీనర్ దుపాకి రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 55 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని, హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
