Labor unions mobilize for their rights : CITU సంగెం మండల కన్వీనర్ ధూపాకి రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో CITU రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు మాట్లాడుతూ.. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, భవన నిర్మాణ, వలస కార్మికుల చట్టాలను కాపాడాలని డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
కార్యక్రమంలో తెలంగాణ ఆటో, ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మొగుళ్ల అనిల్‌కుమార్, గౌరవ అధ్యక్షుడు తాటికాయల రత్నం, హమాలీ అధ్యక్షుడు గుండేటి స్వామితో పాటు శంకర్, రామకృష్ణ, బాబు, నీరటి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
