- భూపాలపల్లి ఎస్ఐ సాంబమూర్తితో జర్నలిస్ట్ రాజేందర్ దామెర
- మౌనానికి, శాంతికి ప్రతీకగా నిలిచే బుద్ధుని చిహ్నాన్ని అందజేత
A soulful reunion after five years : ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘జన నిర్ణయం’ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్ దామెర (దారా), భూపాలపల్లి ఎస్ఐ సాంబమూర్తిని ఆత్మీయంగా కలిశారు. సాంబమూర్తి హనుమకొండ సుబేదారిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక మర్చిపోలేని ఘటన తరువాత వీరిద్దరు ఎక్కడా తారాసపడిన సందర్బం లేదు. ఈ ఐదేళ్ల సదీర్ఘకాలం తరువాత ఆత్మీయంగా రాజేందర్, ఎస్ఐ సాంబమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు.
A soulful reunion after five years..!
కాలం వేగంగా పరుగెత్తినా, కొన్ని జ్ఞాపకాలు మాత్రం చెక్కుచెదరవని ఈ కలయిక నిరూపించింది. రాజేందర్ దామెర ఐదేళ్ల క్రితం ఉన్న ఆ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సోదర సమానుడైన ఎస్ఐ సాంబమూర్తిని కలవడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన ఒత్తిడుల మధ్య ఇలాంటి పలకరింపులు మనసుకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయని వారు పేర్కొన్నారు. ఈ కలయికలో భాగంగా రాజేందర్ దామెర (దారా) ఎస్ఐ సాంబమూర్తికి మౌనానికి, శాంతికి ప్రతీకగా నిలిచే బుద్ధుని చిహ్నాన్ని అందించారు.
