- పరకాలలో బరితెగించిన మద్యం దందా..!
- చట్టం కళ్లుగప్పి కాదు.. చట్టం ముందే అక్రమ విక్రయాలు..!!
- నిమ్మకు నీరెత్తిన ఎక్సైజ్ అధికారులు..
- వాపోతున్న పట్టణ ప్రజలు…
‘Mathu’ who climbed the podium.. పరకాల పట్టణంలో ఇప్పుడు ‘నీతి’ కంటే ‘మత్తు’కే విలువ ఎక్కువైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నూతనంగా పట్టణ పాలనా పీఠం ఫైనల్ అయ్యాక ఈ దందా మరింత విచ్ఛలవిడిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “కాపలా ఉండాల్సిన వారే కంచె తొలగిస్తే.. ఇక చట్టానికి విలువెక్కడ..?” అని పట్టణ ప్రజలు వాపోతున్నారు. మద్యం దుకాణాల అధికారిక వేళలు ముగిసినా కూడా ప్రధాన షట్టర్లు బార్లా తెరిచి మద్యం విక్రయిస్తుండటం చూస్తుంటే, చట్టం వారి జేబులో ఉందా అన్న అనుమానం కలుగుతోందని ప్రజాసంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
‘Mathu’ who climbed the podium..
ఇక పట్టణంలోని హోటళ్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. టిఫిన్ సెంటర్లు, భోజనశాలలు ఇప్పుడు మినీ బార్లుగా రూపాంతరం చెందాయి. ఇలాంటి వ్యాపారాలన్నీ రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులకు స్వయంగా లేదా బినామీల పేరుతో ఉండటంతో, మున్సిపల్ అధికారులు గానీ, ఎక్సైజ్ పోలీసులు గానీ అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదని, ఫలితంగా సామాన్యులు కుటుంబాలు హోటల్‌కు వెళ్లాలంటేనే అసహ్యించుకునే పరిస్థితి నెలకొందనేది బహిరంగ రహస్యంగా మారింది.
‘Mathu’ who climbed the podium..
కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా అధికారులు మౌనంగా ఉండటం వెనుక ఉన్న కారణమేంటనేది పట్టణంలో బహిరంగ రహస్యమే. అయితే “మా మనిషే పాలకవర్గం అయినప్పుడు ఇక తమను అడిగేదెవరు అనే ధీమా మద్యం మాఫియాలో కనిపిస్తోంది”. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ఈ మత్తు దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని, సమయపాలన పాటించని వైన్ షాపుల పట్ల కటినంగా వ్యవహరించి సీజ్ చేయాలని, హోటళ్లలో విచ్ఛలవిడి మద్యం అమ్మకాలు, సిట్టింగులపై చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు ప్రజాసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.
