Sub-Registrar ‘Taslima’, who overcame poverty and rose to prominence : జీవితం విసిరిన సవాళ్లను ఎదురొడ్డి నిలబడ్డారామె. పేదరికం అనే అడ్డంకిని తన పట్టుదలతో అధిగమించారు. నేడు వరంగల్ గ్రేడ్-1 చిట్స్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టి, ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు తస్లీమా. తాజాగా వడ్డేపల్లిలోని కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించిన తీరు, ఆమె నేపథ్యం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి.
Sub-Registrar ‘Taslima’, who overcame poverty and rose to prominence
తస్లీమా ప్రస్థానం సామాన్యమైనది కాదు. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె, కనీస వసతులు లేని చోట నుంచి తన విద్యాభ్యాసాన్ని సాగించారు. అధికారం, హోదా కన్నా ప్రజలకు సేవ చేయాలనే తపనే ఆమెను నేడు ఈ స్థాయికి చేర్చింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి, ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఆమె సాగించిన పోరాటం అమోఘం. ములుగు జిల్లాలో ఆమె వేసిన ముద్ర చెరగనిదిగానే చెప్పక తప్పదు. అయితే కొన్ని ఒడిదుడుకు ఎదురైనా కొన్ని ఆరోపణలు ఎదురైనప్పటికీ తన శైలీలో ముందుకు సాగుతూనే ఉంది. ఉద్యోగం ఉన్నప్పటికీ తన మూలాలను మరువకుండా వ్యవసాయ పనులు చేయటం, ఎడ్లబండినఇ కూడా నడుపటం, తన గ్రామీణులతో నిత్యం మమేకమైన జీవనశైలీ ఆమెకు నిలబెట్టింది. సామాన్యుల ‘తస్లీమా’ గా మార్చింది. తండ్రి వారసత్వాన్ని అందరికీ గుర్తు చేస్తూ అందరికీ తన బందువుగా మారింది. మహబూబాబాద్‌లో సబ్ రిజిస్ట్రార్‌గా తనదైన ముద్ర వేసి, ఇప్పుడు వరంగల్ లాంటి కీలక ప్రాంతానికి గ్రేడ్-1 అధికారిణిగా రావడం ఆమె కార్యదక్షతకు నిదర్శనం.
Sub-Registrar ‘Taslima’, who overcame poverty and rose to prominence
ఒక స్థాయి అధికారిణి అయినప్పటికీ, తస్లీమా జీవనశైలి ఇప్పటికీ అత్యంత సాధారణంగా ఉంటుంది. నిరాడంబరతకు మారుపేరుగా నిలిచే ఆమె, ఆడంబరాలకు ఏనాడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. సగటు మనిషి పడే కష్టాలు తనకు తెలుసు కాబట్టే, తన దగ్గరకు వచ్చే సామాన్యులకు సేవ చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. “అధికారం అనేది శాసించడానికి కాదు.. అది అణగారిన వర్గాలకు, సామాన్యులకు అండగా ఉండటానికి” అనే సిద్ధాంతాన్ని ఆమె బలంగా నమ్ముతారని తనను ఎరిగిన వారు చెప్తుంటారు. చిట్స్ రిజిస్ట్రేషన్ విభాగం అంటే ప్రజల కష్టార్జితంతో ముడిపడిన వ్యవహారం. ఈ బాధ్యతను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తానని పలువురు భావిస్తున్నారు. గతంలో ఆమెపై వచ్చిన కొన్ని వివాదాస్పద ఆరోపణలను తన పనితీరుతో, నిబద్ధతతో పటాపంచలు చేసి, వ్యవస్థలో మార్పు తీసుకువస్తారనే నమ్మకం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినా.. తాను నడిచి వచ్చిన నేలని మర్చిపోని మనస్తత్వం తస్లీమాది. వరంగల్ చిట్స్ విభాగం ఆమె సారథ్యంలో సామాన్యులకు చేరువగా మారుతుందని ఆశిద్దాం…
రాజేందర్ దామెర (దారా)
Editor in chief
jananirnayam.com
