SI Veerabhadra Rao unveils the ‘Jana Nirnayam’ edition తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, విశిష్ట జీవన విధానానికి బతుకమ్మ, విజయదశమి పండుగలు ప్రతీకలని దామెర ఎస్ఐ వీరభద్రరావు అన్నారు. ‘జన నిర్ణయం’ దినపత్రిక వెలువరించిన బతుకమ్మ – దసరా పండుగల ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ… ప్రజా సమస్యలను వెలికితీస్తూ వార్తలను నిష్పక్షపాతంగా అందించడంతో పాటు, మన పండుగల ప్రాశస్త్యాన్ని, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక సంచికను తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. సమాజంలో చైతన్యాన్ని నింపడంలో పత్రికల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం మండల ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ‘జన నిర్ణయం’ పత్రిక ప్రతినిధులు రంజిత్, రమేష్ ప్రత్యేక సంచికను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
