- ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి
Attacks on journalists are not right : ఇటీవల ఆర్బీ న్యూస్ చానెల్ విలేకరి పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సమాజంలో విలేకరి పాత్ర చాలా విలువలతో కూడుకున్నదని ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి అన్నారు. సమాజంలో మంచి చెడులను, అవినీతిని ప్రశ్నించడం విలేఖర్ల వృత్తిలో భాగమని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఇలాంటీ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజా సంక్షేమ వేదిక అధ్యక్షులు మడికొండ రఘుపతి అన్నారు
