- పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్
- సీఎం, ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక
Criticisms stem from an inability to tolerate the development of Parkal పరకాల నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి పనులకు శ్రీకారం చుడుతున్నారని, అలాంటి ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక అర్హత మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి లేదని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ అన్నారు.
మంగళవారం ఆత్మకూర్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేసిన చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెరువుల్లో మట్టి తవ్వకాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, గుట్టల ధ్వంసం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. “మచ్చలేని నాయకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి” నీతి, నిజాయితీకి మారుపేరుగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పనిచేస్తున్నారని శ్రీధర్ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే మాజీ ఎమ్మెల్యే విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు.
- “పదేళ్ల పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాలి”
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, భూవివాదాలు, కబ్జాల ఆరోపణలపై ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సైతం ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని అభినందిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.
అక్కంపేటకు రూ.10 కోట్ల నిధులు
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జన్మించిన అక్కంపేట గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి రూ.10 కోట్ల నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కృషి చేశారని శ్రీధర్ తెలిపారు. జయశంకర్ పేరు చెప్పుకుని రాజకీయంగా లబ్ధి పొందిన బీఆర్ఎస్ నాయకులు ఆయన జన్మస్థల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై నోరు జారితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని శ్రీధర్ హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తే రాజకీయంగా తగిన సమాధానం చెబుతామని అన్నారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తనుగుల సందీప్, ముట్టి సతీష్, మనగాని తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి పిట్టల రాజకుమార్, కడబోయిన రాజ్‌కుమార్, మహ్మద్ కరీం, దూరిశెట్టి శ్రవణ్, జక్కుల ప్రశాంత్, గ్రామ యూత్ అధ్యక్షుడు కుక్కల రమేష్, వైనాల శ్యామ్, జంగా కిషోర్, రితీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
