- అభినందించిన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ, నాయకులు గోపాల నవీన్ రాజ్
Congress leader Jannu Shyam’s birthday celebrations held on a grand scale : వరంగల్ తూర్పు నియోజకవర్గం, 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జన్ను శ్యామ్ జన్మదిన వేడుకలు శనివారం అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, అభిమానుల కోలాహలం నడుమ ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
- మంత్రి ‘కొండా’ ఆశీస్సులు – మర్యాదపూర్వక భేటీ
జన్మదినం సందర్భంగా జన్ను శ్యామ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గారు ఆయనకు శాలువా కప్పి, స్వీట్లు తినిపించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
- నాయకుడు గోపాల నవీన్ రాజ్ స్వగృహంలో వేడుకలు
అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్ ని వారి స్వగృహంలో జన్ను శ్యామ్ కలిశారు. అక్కడ నాయకులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి, శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. శ్యామ్ యొక్క క్రియాశీలక పాత్రను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.
- ‘నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి’ : వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
ఈ వేడుకల్లో పాల్గొన్న వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాష్ మాట్లాడుతూ ”జన్ను శ్యామ్ ప్రజాసేవలో ముందంజలో ఉంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. పార్టీ పురోగతికి ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో వైభవంగా జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జన్ను శ్యామ్‌కు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షల వర్షం కురిపించారు.
