- గ్రామీణ ప్రాంతాల్లో మొదలైన పొద్దాడు సందడి…
- ఆరోగ్యానికి సిరి.. ఈ ‘తీయని’ కల్లు
“Poddadu” is the energy drink of the villagers “పొద్దాడు” కల్లు సీజన్ మొదలైంది. పొద్దు పొడవకముందే ఊరి చివర తాటి వనాల్లో సందడి కూడా మొదలైంది. ఈ పొద్దాడు సీజన్ లో గీత కార్మికులు చెట్లు ఎక్కి తెచ్చే ఆ మొదటి చుక్క కోసం జనం క్యూ కడతారు. అదే పొద్దాడు కల్లు. కల్తీ లేని, స్వచ్ఛమైన ఈ పానీయం రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించడంలో మేటి అని ప్రజలు నమ్ముతుంటారు.
“Poddadu” is the energy drink of the villagers
- ఈ ‘పొద్దాడు’ ప్రత్యేకత ఏమిటంటే..?
రాత్రంతా చెట్టుపైనే కుండలో నిలిచి, తెల్లవారుజామున (సూర్యోదయానికి ముందు) తీసే కల్లును ‘పొద్దాడు’ అంటారు. ఇది తీయగా ఉండటమే కాకుండా, ఎండ తీవ్రతను తట్టుకునే శక్తిని ఇస్తుంది. దీనిలో ఉండే పోషకాలు శరీరానికి చలువ చేస్తాయని నిపుణులు చెప్తుంటారు. సాధారణంగా కల్లు అనగానే ఏదో మత్తు పానీయం అని అనుకుంటారు. కానీ, పచ్చి కల్లులో (పొద్దాడు) అనేక ఔషధ గుణాలున్నాయని పూర్వీకులు చెబుతుంటారు. ఎండకాలంలో బాడీ హీట్‌ను తగ్గించి, శరీరాన్ని చల్లబరుస్తుంది. పొట్టలోని మలినాలను తొలగించి, ఆకలిని పెంచుతుంది. గ్యాస్ సమస్యలకు ఇది ఒక సహజ పరిష్కారానికి కారకంగా ఉంటుంది. ఇందులో విటమిన్ B కాంప్లెక్స్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మరోవైపు మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి, మూత్రం సాఫీగా రావడానికి ఇది దోహదపడుతుందని గ్రామాల్లో నమ్ముతారు. పొద్దాడు కల్లులో ఆల్కహాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. సూర్యరశ్మి సోకకముందే సేవించడం వల్ల ఇది శరీరానికి శక్తినిచ్చే టానిక్‌లా పనిచేస్తుంది.
“Poddadu” is the energy drink of the villagers
- సంస్కృతిలో భాగం…
తెలంగాణ పల్లెల్లో పొద్దాడు కల్లు అనేది ఒక సామాజిక అనుబంధం. చెట్టు కింద కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటూ, ఆ స్వచ్ఛమైన గాలిలో కల్లు తాగడం ఒక అపురూపమైన అనుభూతి. కల్తీ లేని కల్లు దొరికితే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
“Poddadu” is the energy drink of the villagers
గమనిక : ఏదైనా పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. కల్తీ లేని స్వచ్ఛమైన కల్లును మాత్రమే ఎంచుకోవడం శ్రేయస్కరం.
