- పండగ సాయన్న వర్థంతి సందర్బంగా….
- పల్లెబోయిన సుధాకర్
ముదిరాజుల సమన్వయకర్త
ఉమ్మడి వరంగల్ జిల్లా
సెల్ : 99492 79802
If you ignore the festival “Sayanna”..!
It’s like ignoring the old kings..!! నా దృష్టిలో పండుగ సాయన్నను విస్మరిస్తే ముదిరాజులను విస్మరించినట్లే. ఎందుకంటే ముదిరాజ్ ముద్దబిడ్డ తెలంగాణ జాతి గర్వించదగ్గ వీరుడు, స్వాతంత్ర్య పోరాట సింహం పండుగ సాయన్న. నేడు ఆయన వర్థంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఒకరకంగా ముదిరాజులకు అస్థిత్వ చిహ్నంగా ఉన్న పండుగ సాయన్నను విస్మరిస్తున్న పరిస్థితి ఉంది. ఇది ముదిరాజుల ఆత్మగౌరవానికి భంగం అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. సత్యం, ధైర్యం, ప్రజా స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని అర్పించిన ముదిరాజ్ ఆశాధీపమైన పండుగ సాయన్న త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన చూపిన మార్గం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయన స్పూర్తిని అందరికి తెలిసేలా ముదిరాజుల అస్థిత్వం నిలబడేలా పాలకులు, క్షేత్ర స్థాయిలోని నాయకులు సైతం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. వర్థంతులు, జయంతులను సైతం మరిచే ఈ పరిస్థితి నుంచి మనం ఆశీంచడం అత్యాశే అవుతుందేమో కానీ పండగ సాయన్న స్పూర్తిని మాత్రం ముదిరాజ్ లు మాత్రం పునికిపుచ్చుకోవాలి. పాలకులు వివక్షపూరితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పండుగ సాయన్నకు గుర్తింపునివ్వాలి.
If you ignore the festival “Sayanna”..!
It’s like ignoring the old kings..!! పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు. పండుగ సాయన్న 1860 నుండి 1900 వరకు జీవించి. 35-38 ఏళ్ల వయసులో చంపబడ్డారు. దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, ఒకరకంగా తెలంగాణ రాబిన్హుడ్ గా సుపరిచితుడు. పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారాలను ప్రశ్నించి, వారిని ఎదిరించి, తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకొని, ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆధిపత్య శక్తులైన దేశముక్ లు, కరణంపటేళ్లు, భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. ఇది చరిత్ర చెప్తున్న అంశం. ఇంతటి చరిత్ర ఉన్న ముదిరాజ్ ల అస్థిత్వమైన పండుగ సాయన్నను విస్మరిస్తే ముదిరాజ్ లను విస్మరించినట్లే అనేది గుర్తించాలి.
- జయహో పండుగ సాయన్న…
జయజయహో ముదిరాజ్ ముద్దుబిడ్డలారా…
మీ త్యాగాలు చిరస్థాయిగా ఉంటాయి
