- రామతీర్థం గ్రామ సర్పంచ్ అభ్యర్థి పొదిళ్ల వసంత శోభన్
Vote for the scissors symbol and make it win కత్తెర గుర్తుకు తమ అముల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామ సర్పంచ్ అభ్యర్థి పొదిల. వసంత శోభన్ అన్నారు. శనివారం గ్రామంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పుజలు నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో పలువురిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామం లో ఇంకా పరిష్కారం కావాల్సి న సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటిని అధికారులతో ప్రశ్నించి పరిష్కరించే దిశగా గ్రామంలోని పలు సంఘల నాయకులు సహకారం ముందుకు సాగుతానని, గ్రామ అభివృద్ధి కోసం చేపట్టబోయే కార్యక్రమాలు గ్రామ రహదారులు, శుద్ధి చేసిన తాగునీటి సరఫర, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఉండేలా చుడటం, యువతకు ఉపాధి అవకాశాలు. క్రీడా మౌలిక వసతులు, పాఠశాల, అంగన్వాడీల అభివృద్ధి, మహిళల శ్రేయస్సు కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
