
- నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసిన సబ్ రిజిస్ట్రార్..!
- సబ్ రిజిస్ట్రార్ అక్రమాలకు పాల్పడితే కాపాడిన జిల్లా రిజిస్ట్రార్..?
- సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కాకపోవడం వెనుక ఏం జరిగింది.,?
Akram Anand in the registration department : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆ సబ్ రిజిస్ట్రార్ హవా జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్నినెలల క్రితం హన్మకొండ ఆర్వో కార్యాలయానికి సబ్ రిజిస్ట్రార్ గా బదిలీపై వచ్చిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు సబ్ రిజిస్ట్రార్ కు జిల్లా రిజిస్ట్రార్ అండదండలు ఉండడంతోనే ఇష్టారాజ్యంగా అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడినట్లు సమాచారం.
Akram Anand in the registration department
సదరు సబ్ రిజిస్ట్రార్ ఏమైనా అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడితే కాపాడేందుకు జిల్లా రిజిస్ట్రార్ వెంటనే రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ ల వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో జిల్లా రిజిస్ట్రార్ కలుగజేసుకొని ఎలాంటి అక్రమ రిజిస్ట్రేషన్ లు జరగలేదని ఉన్నతాధికారులను సైతం బురిడీకొట్టించినట్లు ఆర్వో కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్ ల వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ కాకుండా కాపాడడంలో జిల్లా రిజిస్ట్రార్ సక్సెస్ అయ్యాడని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.నిబంధనలకు విరుద్ధంగా ఆనందుడు రిజిస్ట్రేషన్ లు చేయగా సస్పెండ్ కాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులకు పెద్దమొత్తంలో ముట్టజెప్పినట్లు ప్రచారం లేకపోలేదు.
Akram Anand in the registration department
అక్రమానంద్ అక్రమ రిజిస్ట్రేషన్ లు ..డాక్యుమెంట్ నెంబర్ ల వివరాలు….
సబ్ రిజిస్ట్రార్” ఆనంద్ “సస్పెన్షన్ నుండి ఎలా తప్పించుకున్నాడు..?తెరవెనుక జరిగిన తతంగం ఏంటి(ఆమ్యామ్యాల వ్యవహారం)..?
సంచలన కథనం త్వరలో….