- గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ‘గద్దర్ గళం’ ఆధ్వర్యంలో సభ
- ప్రజావాగ్గేయకారుడు సంజీవ్ ముఖ్య అతిథిగా హాజరు
Today marks Gaddar’s third death anniversary : ప్రజల యుద్ధనౌక, ప్రజాకవి గద్దర్ మూడో వర్ధంతి సందర్భంగా ఆగస్టు 8వ తేదీ ఉదయం 10 గంటలకు హన్మకొండ ప్రెస్ క్లబ్లో స్మారక సభ నిర్వహించనున్నట్లు గద్దర్ గళం నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రజావాగ్గేయకారుడు సంజీవ్ ముఖ్య అతిథిగా హాజరై గద్దర్ జీవితం, ఆశయాలు, ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్రపై ప్రసంగించనున్నారు. గద్దర్ పాటలు, ఆయన ప్రజా చైతన్య స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటాన్ని ఈ సభలో స్మరించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
అలాగే ప్రముఖ పాత్రికేయుడు జహీర్ అలీ ఖాన్ అమరుడైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సేవలను కూడా సభలో స్మరించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజల గొంతుకగా నిలిచిన ఆయన పాత్రను వక్తలు ప్రస్తావించనున్నట్లు తెలిపారు. గద్దర్ ఆశయాలను నేటి తరానికి చేరవేయడం, ప్రజల పక్షాన నిలిచే సాంస్కృతిక ఉద్యమాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గద్దర్ అభిమానులు, కళాకారులు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల నాయకులు, పాత్రికేయులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
కార్యక్రమ వివరాలు
తేదీ: 08-08-2026 ( నేడు శనివారం )
సమయం: ఉదయం 10.00 గంటలకు
వేదిక: ప్రెస్ క్లబ్, హనుమకొండ
నిర్వహణ : గద్దర్ గళం
