SP’s annual inspection at Regonda police station : వార్షిక తనిఖీల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ మంగళవారం రేగొండ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు.ఈ సందర్భంగా స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధి నిర్వహణతో పాటు పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్ నమోదు, బ్లూకోల్ట్ వాహనాల స్పందన, సీసీ కెమెరాల పనితీరును ఎస్పీ సమీక్షించారు. స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని, లోపాలున్న కెమెరాలను వెంటనే మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు.
రిసెప్షన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి, దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో నవీకరించాలని సూచించారు. రౌడీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నిస్పాక్షికంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా సేవలు అందించాలని ఎస్పీ ఆదేశించారు.కార్యక్రమంలో డీఎస్పీ సంపత్‌రావు, ఘనపూర్ సీఐ కర్ణాకర్‌రావు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
