Inspection of diagnostic centers and PHCs : ములుగు జిల్లా మంగపేట మండలంలో ఐటిడిఎ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ క్రాంతి ఆధ్వర్యంలో అధికారులు శనివారం డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న అరవింద్ డయాగ్నోస్టిక్స్కు నోటీసు జారీ చేశారు. అలాగే ఆర్ఎంపీ వైద్యుడు రోగులకు ఇంజెక్షన్లు ఇవ్వవద్దని, అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో రిజిస్టర్లు పరిశీలించి కాలానుగుణ వ్యాధుల నివారణ చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు.
