Gundeti Rajkumar appointed as General Secretary of Warangal District SC Cell వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా గుండేటి రాజ్‌కుమార్ నియమితులయ్యారు. ఎస్సీ వర్గాల సంక్షేమానికి, సమాజ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు, అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ఎస్సీ వర్గాల హక్కుల సాధనకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా లభించే ఫలాలను అణగారిన వర్గాలకు అందేలా ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు. గుండేటి రాజ్‌కుమార్ నియామకం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఆయనను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
