Pasunuri Swami appointed as Chief Advisor of the Telangana Land Protection Committee : తెలంగాణ భూరక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లాల ముఖ్య సలహాదారుడిగా పసునూరి స్వామి నియమితులయ్యారు. ఈ మేరకు భూరక్షణ సమితి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు, ‘దళితరత్న’ నత్తి కోర్నెల్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పసునూరి స్వామి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పేదల అసైన్డ్, సీలింగ్, ఇనాం భూముల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతానని, అలాగే సంస్థ బలోపేతానికి తనవంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
