- నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్
- మాస్ సావిత్రి AIFDS రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్
A stepmother’s love for education : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేటాయించిన నిధులు తీవ్ర నిరాశకు గురిచేశాయి. దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యను నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్లక్ష్యం చేసింది. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన కేంద్ర బడ్జెట్ ను అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (aifds) తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి గారు తీవ్రంగా ఖండించారు.
A stepmother’s love for education
ఈ సందర్భంగా రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి మాట్లాడుతూ…. కేంద్ర బడ్జెట్ మొత్తం సుమారు ₹53.5 లక్షల కోట్లు కాగా, విద్యారంగానికి కేటాయించిన మొత్తం కేవలం ₹1.39 లక్షల కోట్లు మాత్రమే, అంటే మొత్తం బడ్జెట్లో సుమారు 2.6% మాత్రమే. ఇది ప్రపంచంలో అత్యధికంగా ఉన్న యువత, విద్యార్థులు గల దేశానికి పూర్తిగా సరిపోని, బాధ్యతారాహిత్యపు కేటాయింపులు ఇవి. కేంద్ర బడ్జెట్ లో కనీసం 10%, జిడిపిలో 6శాతం నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం సిగ్గు చేటు. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిన విద్యార్థి వ్యతిరేక జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి 2020) ప్రకారం విద్యపై జిడిపి లో కనీసం 6% ఖర్చు చేస్తామని చెప్పారు.వారు చెప్పిన దాని ప్రకారం అయినా నిధుల కేటాయింపు లేదు. అంటే విధాన ప్రకటనలు ఒకవైపు, నిధుల కేటాయింపులు మరోలా ఉండడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టంగా చూపిస్తోంది.
A stepmother’s love for education
ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ విద్య, లక్షల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల నియామకాలు, స్కాలర్షిప్లు వంటి మౌలిక అవసరాలపై తగిన నిధులు కేటాయించలేదు. ఐఐటి, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు ఫీజులను నియంత్రించలేదు. స్కాలర్ షిప్స్ పెంచలేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు తీసుకొచ్చి విద్యార్థులపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నారు.దీనివల్ల పేద, దళిత, ఆదివాసి, వెనుకబడిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారు.
A stepmother’s love for education
ఏఐ, స్కిల్ డెవలప్మెంట్, కంటెంట్ క్రియేషన్ వంటి మార్కెట్ ఆధారిత రంగాలపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల విద్యలో అసమానతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ, మైనారిటీ మరియు పేద విద్యార్థుల కోసం ఉన్న స్కాలర్షిప్లు, ఫెలోషిప్లను పెంచకపోగా కోతల విధిస్తున్నారు. ఇది సామాజిక న్యాయంపై నేరుగా దాడి చేయడమే. ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణపై ఎలాంటి హామీ లేకపోవడం విద్యను హక్కుగా కాకుండా సరుకుగా మార్చే ప్రయత్నాన్ని దూకుడుగా ముందుకు తీసుకొస్తుంది.
విద్య అనేది కార్పొరేట్ అవసరాలకు మాత్రమే సేవ చేసే సాధనం కాదు. అది సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యాన్ని బలపరిచే మూలాధారం. కానీ ఈ బడ్జెట్ ఆ దిశగా కాకుండా విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు దారితీసే విధంగా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి రావలసిన సైనిక్, నవోదయ స్కూల్స్, ఐఐఎం, ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీల ఏర్పాటుపై కనీస ప్రకటన లేకపోవడం తెలంగాణ విద్యార్థి లోకాన్ని మోసం చేయడమే. ఈ కింది ప్రతిపాదనలకు ఆధారంగా బడ్జెట్ ను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
