
జీవో కు విరుద్ధంగా అక్రమ ప్రమోషన్ పొందిన “మల్లిఖార్జునుడు”..!
డిటిఓ, టీఓ ప్రమోషన్ కు అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్ కల్పించిన అధికారులు…!!
అక్రమ పద్దతిలో దశాబ్దకాలానికి పైగా ప్రమోషన్ కొనసాగిస్తున్న “మల్లిఖార్జునుడు”…
అంతా తెలిసినా గమ్మునుంటున్న ఉన్నతాధికారులు…
తక్షణమే విచారణ చేపట్టాలంటున్న పలువురు…
వరంగల్ప్రభుత్వ “ఐటిఐ” పరిధిలో జీవో నెంబర్ “23” తుంగలో తొక్కబడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ పద్దతిలో దశాబ్ద కాలానికి పైగా అక్రమ పద్ధతుల్లో డిటిఓ, టీఓ గా ప్రమోషన్ పొందినప్పటికీ అంతా సక్రమ పద్ధతిలోనే జరిగిందని “మల్లిఖార్జునుడు” డాంబికాలకు పోతున్నట్లు ప్రచారం సాగుతోంది. “ఐటిఐ”లో జీవో “23” ప్రకారం “టిడిఓ”గా ప్రమోషన్ పొందాలంటే తప్పనిసరిగా
నేషనల్ నేషనల్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ పాస్ సర్టీఫికెట్ తప్పనిసరి ఉండాలని జీవో చెప్తున్నప్పటికీ ఆ జీవో ఎందుకు అమలు కాలేదని అందుకు విరుద్ధంగా ప్రమోషన్ ఎలా పొందగలిగారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు విచారణ చేపట్టి చర్యలు అక్రమ ప్రమోషన్ వ్యవహారంలో చర్యలు చేపడుతారా లేదా అనేదే ప్రశ్నగా మిగిలింది.
*******
ప్రభుత్వ “ఐటిఐ”లో “జీవో 23” సమగ్రంగా ఏం చెప్తున్నది. ఆ జీవో నెంబర్ 8వ పేజీలో ఏం చెప్పబడి ఉంది. అక్రమ పద్దతిలో డిటిఓ, టీఓ గా అక్రమ ప్రమోషన్ పొందిన “మల్లిఖార్జునుడి”లీలల కథ త్వరలో….
*****