- ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిబంధనలు పాతర..!?
Rules are being trampled on..Converting agricultural land into plots : నిబంధనలు గాలికొదిలేశారు.. చట్టాలను తుంగలో తొక్కారు.. కాసులు కురిపిస్తే చాలు ‘వ్యవసాయ’ భూమిని కూడా ‘నివాస’ స్థలంగా మార్చే మంత్రదండం అక్కడ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ల పర్వం యథేచ్ఛగా సాగుతోందని, నాలా (NALA) కన్వర్షన్ లేకుండా, కనీస అనుమతులు లేకుండానే వ్యవసాయ భూమిని గజాల లెక్కన ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆధారాలతో కూడిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. గీసుగొండ మండలం, వరంగల్ సిటీ పరిధిలోని పలు గ్రామాల పరిధిలో ఏమాత్రం పరిశీలించినా పలు అంశాలు వెలుగుచూసే అవకాశం ఉంటుందనేది గమనార్హం.
Rules are being trampled on..! Converting agricultural land into plots..!!
నిబంధనలకు పాతర..
సాధారణంగా వ్యవసాయ భూమిని ప్లాట్లుగా విక్రయించాలంటే దానికి సంబంధించి రెవెన్యూ విభాగం నుంచి నాలా (Non-Agricultural Lands Assessment) అనుమతి తప్పనిసరి. కానీ, వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం ఈ నిబంధనలు అస్సలు వర్తించవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగు భూమిని సైతం ప్లాట్ నంబర్లతో గజాల లెక్కన రిజిస్ట్రేషన్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Rules are being trampled on..! Converting agricultural land into plots..!!
- అక్కడ అంతా సాధ్యమేనా..?
“వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అన్నీ సాధ్యమే” అనే టాక్ ఇప్పుడు జిల్లావ్యాప్తంగా వినిపిస్తోంది. రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం సర్వే నంబర్ల ఆధారంగా ఎకరాలు, గుంటల లెక్కన జరగాల్సిన రిజిస్ట్రేషన్లు.. ఇక్కడ మాత్రం ప్లాట్ నంబర్లు, గజాల లెక్కన ఎలా మారుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉన్నతాధికారుల కళ్లుగప్పి లేదా వారి అండదండలతోనే ఈ దందా సాగుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారనేది గమనార్హం.
Rules are being trampled on..! Converting agricultural land into plots..!!
- ఉన్నతాధికారులు దృష్టి సారించేనా..?
ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపితే మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న తంతుపై సమగ్రమైన విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాల చిట్టా విప్పితే మరిన్ని కబ్జాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూసే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు.
