
- ఐనవోలు తహశీల్దార్ నిబంధనలకు విరుద్ధంగా వందలకొద్ది నాలా కన్వర్షన్ చేసిన ఘనుడు…
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అండగా తహశీల్దార్
- నాన్ లేఅవుట్ వెంచర్ల యజమానుల నుంచి భారీ మొత్తంలో తహశీల్దార్‌కు ముడుపులు ముట్టాయని ప్రచారం..
- చెయ్యి తడపందే ఏ పని జరగదట..?
- ఆ తహశీల్దార్ పై విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందని గుసగుసలు…
Here is the evidence for the illegal conversions of the Tahsildar: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో విధులు నిర్వహిస్తున్న తహశీల్దార్ మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తహశీల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై వ్యవసాయ భూములను ముక్కలు ముక్కలుగా విభజించి గజాలుగా నాలా కన్వర్షన్ చేసినట్లు సమాచారం. నాన్ లేఅవుట్ వెంచర్ యజమానుల నుంచి బారి మొత్తంలో నజరానాలు తీసుకున్నాడనే ఆరోపణలు కూడా లేకపోలేదు. సదరు తహశీల్దార్ పై విజిలెన్స్ అధికారులు కనుక దృష్టి సారస్తే ఐనవోలు మండలంలో జరిగిన అక్రమ నాలా కన్వర్షన్ తతంగం బట్టబయలు అయ్యే అవకాశం ఉందనేదనేది గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఐనవోలు తహశీల్దార్ చేసిన అక్రమ నాన్ లేఅవుట్ వ్యవసాయ భూములను గజాలుగా మార్చి చేసిన నాలా కన్వర్షన్ లపై విచారణ చేసి ఐనవోలు తహశీల్దార్ పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే..
మచ్చుకు కొన్ని….
99 / b / 4 / 2 / 2 / 2
99 / b / 4 / 2 / 2 / 1 / 2
99 / b / 4 / 2 / 2 / 1 / 1 / 2
99 / 4 / 2 / 2 / 1 / 1 / 1 / 2
99 / b / 4 / 2 / 2 / 1 / 2
99 / b / 4 / 2 / 2 / 1 / 1 / 1 / 2
- విక్రమార్కుని అక్రమ నాలా కన్వర్షన్ల లీలలు, ఓ వెంచర్ కు అసలే నాలా కన్వర్సషన్ పర్మిషన్ ఇవ్వొద్దనే సర్క్సంయులర్ ను సైతం లెక్కచేయకుండా సదరు తహశీల్దార్ చేసిన లీలల సమగ్రమైన కథనం జన నిర్ణయం సంచికలో…