
- నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసిన సబ్ రిజిస్ట్రార్ ఆనంద్…!
- అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడిన హనుమకొండ ఆర్వో కార్యాలయ సబ్ రిజిస్ట్రార్..!!
- సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ లపై డిఐజి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే…?
Does the “DIG” know? Doesn’t he know : సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడిన విషయం జిల్లా రిజిస్ట్రార్ ఫణిoదర్ దృష్టికి వెళ్లడంతో సదరు అధికారి విచారణ సైతం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే జిల్లా రిజిస్ట్రార్ విచారణ చేసినప్పటికీ ఎందుకు సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ను కాపాడి ఉంటాడనే అనుమానాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలోని మెజార్టీ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. అసలు విషయం ఏమిటంటే సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ అక్రమ రిజిస్ట్రేషన్ ల వ్యవహారం అసలు స్టాంప్స అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి మేడం కు జిల్లా రిజిస్ట్రార్ తెలియజేశారా లేదా అనేది ప్రశ్నగా మిగిలిపోయింది.
- సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ నిబంధనలకు విరుద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్ ల వివరాలు డాక్యుమెంట్ నెంబర్ ల వారీగా…
23981/2024…
23983/2024…
23982/2024…
23984/2024…
2816/2025…
2817/2025..
26324/2024…
26325/2024…
56/2025…
2818/2025…
Does the “DIG” know? Doesn’t he know
- డిఐజి చర్యలు తీసుకునేనా…?
హన్మకొండ ఆర్వో కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ అనేక అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడ్డప్పటికి జిల్లా రిజిస్ట్రార్ ఫణిoదర్ ఎలాంటి చర్యలు తీసుకోవడమే కాకుండా సబ్ రిజిస్ట్రార్ తో రహస్య ఒప్పందం కుదుర్చుకుని సస్పెండ్ కాకుండా కాపాడినట్లు ఆర్వో కార్యాలయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసిన సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ను జిల్లా రిజిస్ట్రార్ కాపాడినట్లు ఆరోపణలు రావడంతోపాటు అసలు డి ఐ జి మేడం ఈ రిజిస్ట్రేషన్ లపై ఎలా స్పందిస్తారో అనే ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ అక్రమ రిజిస్ట్రేషన్ లపై డి ఐ జి మేడం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది రేపటిలోగా తేలిపోనుంది.
- అమాత్య సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ అక్రమ రిజిస్ట్రేషన్ లపై మీరైనా స్పందిస్తారా..? మరో కథనం రేపటి సంచికలో…