
- నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు… డాక్యుమెంట్ నెంబర్ లు…
- జిల్లా రిజిస్ట్రార్ ను ప్రసన్నం చేసుకుంటేనే సస్పెన్షన్ ఆగిందా..?
- డిఐజి మేడం కు సబ్ రిజిస్ట్రార్ భాగోతం తెలుసా..? తెలియదా..?
Evidence of Anand’s irregularities : రిజిస్ట్రేషన్ శాఖలో ఆనందుడి లీలలు అన్నీఇన్నీ కావట. తనేం అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడినా బయటపడేందుకు “లకారాల” వ్యూహాన్ని అమలుచేస్తుంటాడని తెలుస్తోంది. అక్రమాలకు అలవాటు పడిన సదరు సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ఉన్నతాధికారుల సహకారంతోనే సస్పెన్షన్ నుండి తప్పించుకున్నట్లు స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎందుకంటే గత కొన్ని నెలల క్రితం హనుమకొండ ఆర్వో(జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం) కార్యాలయానికి బదిలీపై వచ్చిన సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసి లక్షల రూపాయలు కొట్టేసినట్లు ఆరోపణలు రావడంతో జిల్లా రిజిస్ట్రార్ ఫణిoదర్ అక్రమ రిజిస్ట్రేషన్ లపై విచారణ సైతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.అయితే జిల్లా రిజిస్ట్రార్ ను సబ్ రిజిస్ట్రార్ ప్రసన్నం చేసుకోవడం మూలంగానే సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ ఆగినట్లు ప్రచారం జరగడం గమనార్హం.
Evidence of Anand’s irregularities
- నిబంధనలకు విరుద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్ ల డాక్యుమెంట్ నెంబర్ లు…
హన్మకొండ ఆర్వో కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లు జననిర్ణయం పరిశీలనలో తేలింది.సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ చేసిన రిజిస్ట్రేషన్ లు డాక్యుమెంట్ ల వారిగా…
23981/2024…
23983/2024…
23982/2024…
23984/2024…
2816/2025…
2817/2025..
26324/2024…
26325/2024…
56/2025…
2818/2025…
Evidence of Anand’s irregularities
పైన పేర్కొన్న డాక్యుమెంట్ లు సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ లకు సాక్ష్యాలు. ఇవన్నీ తెలిసినా జిల్లా రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ను కాపాడుతున్నాడంటే లకారాలు చేతులు మారాయని ప్రచారం జరుగుతున్నదాంట్లో వాస్తవం లేకపోలేదని స్పష్టంగా అర్ధంచేసుకోవచ్చని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Evidence of Anand’s irregularities
- డిఐజి మేడం ఆనంద్ భాగోతాలు మీకు తెలుసా..? తెలియదా..?
- ఇప్పటికైనా సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేస్తారా…? అసలు పొంగులేటి మాట ఆ శాఖలో చెల్లుతోందా..? మరో కథనం మీ “జననిర్ణయం “లో