
- పరకాల “లక్ష్మి సీడ్స్” బరితెగింపుతనం
- “ఏవో” సపోర్ట్ తో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం…
- ఫిర్యాదు చేసిన రైతులతో బుజ్జగింపు చర్యలు చేసినట్లు సమాచారం…
- “రాజీ” మార్గంలో ఫిర్యాదులు వాపస్ తీసుకునేలా చర్చలు
- “ఏవో”నే అసలు సూత్రధారి అనే ఆరోపణలు…
Fack seeds బరాబర్ నకిలీ విత్తనాలే అమ్మినం. ఐతే ఏంటీ..? “ఏవో” సపోర్ట్ ఉంది. ఎలాంటి చర్యలు చేపట్టకుండా అన్ని రకాలుగా అండదండలూ ఉన్నాయి. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు ఇక చేసేది ఏం ఉంటుంది. నాలుగు విత్తనాల బ్యాగులు పడేస్తే గఫ్చూఫ్ అవడం తప్ప. ఇదీ హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని నకిలీ విత్తనాలు రైతులకు అమ్మిన “లక్ష్మి సీడ్స్” వ్యవహారం.
Fack seeds Hanumakonda district హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని లక్ష్మి సీడ్స్ లో విత్తనాలు కొని నష్టపోయిన రైతులు వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) కు ఇటివల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇట్టి ఉదంతాన్ని “జన నిర్ణయం” వరుస కథనాలు అందిస్తున్న విషయం కూడా విధితమే. అయితే రైతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టాల్సిన ఏవో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఏకంగా సదరు లక్ష్మి సీడ్స్ కు ఫుల్ సపోర్ట్ గా నిలుస్తూ ఉచిత సలహాలు పుష్కలంగా ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. “ఏవో” సపోర్ట్ తో లక్ష్మి సీడ్స్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనేది బహిరంగ రహస్యంగా మారింది. మరోవైపు ఫిర్యాదు చేసిన రైతులతో బుజ్జగింపు చర్యలు చేసినట్లు సమాచారం.
“రాజీ” మార్గంలో ఫిర్యాదులు వాపస్ తీసుకునేలా చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. ఏకంగా ఓ రైతును బుజ్జగించిన “లక్ష్మి సీడ్స్” నిర్వాహకులు ఏవో అండగా ఉన్నారు. రైతులు చేసేది ఏం ఉంటుంది నాలుగు విత్తనాల బ్యాగులు తీసుకొని గఫ్చూఫ్ గా ఉండటం తప్ప అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారానికి “ఏవో”నే అసలు సూత్రధారి అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ నకిలీ విత్తనాల దందాకు అధికారులే అండగా ఉంటే ఇక కంచె చేసు మేయడం కాక ఏమవుతుందనేదే కొసమెరుపు…