
- “సోమ్లాతండా” తమ గుప్పిట్లో ఉందంటూ ప్రచారం
- “జన నిర్ణయం” కథనాలపై తప్పుడు ప్రచారానికి ప్లాన్…
- కేసులు పెడుతాం… ధర్నా చేయిస్తాం…. ప్రెస్ మీట్ పెడుతామంటూ అవాకులు చవాకులు చేస్తున్నట్లు ప్రచారం…
- ఓ మీడియా ప్రతినిధి సలహా పాటిస్తున్నట్లు సమాచారం…
- చిన్నపత్రికల కథనాలు ఏం చేయలేయలేవంటూ, అవసరమైతే కేసుల పేరుతో బెదిరించమంటూ ఓ ప్రధాన పత్రికా ప్రతినిధి సలహా ఇస్తున్నట్లు సమాచారం…
- ఏం లేనిదే సదరు ప్రభుత్వ టీచర్ కు ఉలిక్కి పాటు ఎందుకో…
- దొంగలు పడ్డాక ఆరునెలలకు………
- ………………అరవడం వెనుక అంతర్యం ఏమిటి…
- తాటాకు చప్పుళ్లకు “జన నిర్ణయం” అదిరేదిలేదు బెదిరేదిలేదు
- సోమ్లాతండా గిరిజన పాఠశాలల నిర్వాహణ పట్ల ఐటిడిఎ అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాల్సిన అవసరముందనే అభిప్రాయాలు
Mulugu district ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గరలోని సోమ్లాతండా గిరిజన ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న government teacher ప్రభుత్వ టీచర్ ఉలిక్కిపడుతున్నారు. Somlathanda సోమ్లాతండా పాఠశాలలో గిరిజన విద్య కుంటుపడుతుందని, ఆ ప్రభుత్వ టీచర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్నారని, విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని, ఇట్టి విషయంలో itda ఐటిడిఎ ఇతర సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని jananirnayam “జన నిర్ణయం” వరుస కథనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సదరు “బడి పంతులు” ఉలిక్కి పడి జన నిర్ణయం కథనాలపై అవాకులు చవాకులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Somlathanda “సోమ్లాతండా” తమ గుప్పిట్లో ఉందంటూ ప్రచారం చేసుకుంటూ jananirnayam”జన నిర్ణయం” కథనాలపై తప్పుడు ప్రచారానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కేసులు పెడుతాం… ధర్నా చేయిస్తాం…. ప్రెస్ మీట్ పెడుతామంటూ హెచ్చరిక సంకేతాలు వదలడం హాస్యాస్పదమే అవుతోంది. అయితే ఓ మీడియా ప్రతినిధి సలహా పాటిస్తున్నట్లు ఎవరేం చేయలేరని ధీమా వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చిన్నపత్రికల కథనాలు ఏం చేయలేయలేవంటూ, అవసరమైతే కేసుల పేరుతో బెదిరించమంటూ ఓ ప్రధాన పత్రికా ప్రతినిధి సలహా ఇస్తున్నట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఏం లేనిదే సదరు ప్రభుత్వ టీచర్ కు ఉలిక్కి పాటు ఎందుకనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ఈ వ్యవహారం దొంగలు పడ్డాక ఆరునెలలకు……………………అరుస్తున్నట్లుగా ఉందని పలువురు భావిస్తున్నారు. సదరు ప్రభుత్వ టీచర్ అంత శాఖాహారి అయితే జన నిర్ణయం వార్తాకథనం మొదటి రోజే ఖండించవచ్చు. అప్పుడు కథనం అంటూ తను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పవచ్చు. తన సపోర్ట్ దారులు ఎవరైనా మీడియా ప్రతినిధులు ఉంటే వారితో కథనాలు ప్రచురించేలా చేయవచ్చు. కానీ ఇవేమీ చేయకుండా వరుస వార్తాకథనాలు వెలువడుతున్న నేపధ్యంలో దొంగలు పడ్డ ఆరు నెలలకు మేలుకున్నట్లు ఇప్పుడు జన నిర్ణయం పట్ల దురుసుగా వ్యవహరించేందుకు సిద్ధపడట్టం వెనుక ఎవరి అభయహస్తం ఉందనేదే ఇక్కడ ప్రశ్న.
ఇక తాటాకు చప్పుళ్లకు jananirnayam”జన నిర్ణయం” అదిరేదిలేదు బెదిరేదిలేదు అనేది గమనించాలి. సోమ్లాతండా గిరిజన పాఠశాలల నిర్వాహణ పట్ల, ఆ ప్రభుత్వ టీచర్ విధుల నిర్వాహణ పట్ల jananirnayam”జన నిర్ణయం” అందిస్తున్న వార్తాకథనాలపై నిక్కచ్చిగా నిలబడుతుంది. సంబంధిత అధికారుల వివరణ కోరిన తరువాతనే, క్షేత్రస్థాయిలో సమగ్రమైన స్టడీ చేసిన తరువాతనే jananirnayam”జన నిర్ణయం” వార్తాకథనాలు ప్రచురిస్తోందనేది మరువొద్దు.
Itda ఐటిడిఎ అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.