- డివిజన్ అధ్యక్షుడు బుస్సా నవీన్‌కుమార్
Formation of New Congress Committee for 60th Division వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 60వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. డివిజన్ ఇన్చార్జ్ డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు ఎన్నుకొంటి నాగరాజు, ఎన్నుకొంటి పున్నం చందర్, నాయకులు మెరుగు శివ, జనగాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీని ఎంపిక చేశారు. డివిజన్ అధ్యక్షుడు బుస్సా నవీన్‌కుమార్ అధ్యక్షతన, ఉపాధ్యక్షులుగా ఎం.కమల్‌కుమార్, శేఖర్, వంశీ, నయీమ్ ఎంపికయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా ఎం.డి.అక్మల్, శేషు జాగృతి, కోశాధికారిగా ఎన్.యుగేందర్‌ను నియమించారు.
కార్యదర్శులుగా ఎం.డి.ఘౌస్, ప్రభాకర్, పవన్, కె.రమేష్, ప్రణయ్, ఎం.రాజు; కార్యవర్గ సభ్యులుగా వై.ప్రశాంత్, ఎం.అజయ్, ఎస్.రాజు, ప్రభాకర్, శ్రవణ్, లక్ష్మీవేణు, ప్రదీప్, షరీఫ్‌లను ఎంపిక చేశారు. అడ్వైజరీ కమిటీ సభ్యులుగా జనగాం శ్రీనివాస్, మెరుగు శివ, మైనారిటీ విభాగానికి ఎం.డి.సాజిద్, ఎస్సీ సెల్‌కు బోడ ప్రసాద్, బీసీ సెల్‌కు బి.కిషోర్‌కుమార్, సోషల్ మీడియా బాధ్యతలకు సోహైల్, యువజన అధ్యక్షుడిగా డి.శ్రీకాంత్‌ను నియమించారు. నూతన కమిటీ డివిజన్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.
