Professor B. Venkatrama Reddy assumes charge as Dean of the Faculty of Science at KU : కాకతీయ విశ్వవిద్యాలయ (కేయూ)సైన్స్ విభాగాల డీన్‌గా ఆచార్య బి. వెంకట్రామరెడ్డి ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీన్ ఆచార్య జి. హనుమంతు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆచార్య బి. వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ డీన్‌గా ఆచార్య జి. హనుమంతు అందించిన సేవలను కొనియాడారు. విశ్వవిద్యాలయంలో సైన్స్ విభాగాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన ఆచార్య బి. వెంకట్రామరెడ్డిని పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందించారు.
