Do not trust middlemen and hand over money:Sarpanch Sadayya ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పింఛన్లు ఇప్పిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంగెం మండలం గవిచర్ల గ్రామ సర్పంచ్ బాషిపాక సదయ్య సూచించారు. గతంలో పింఛన్లు, ఇతర పథకాల పేరుతో పేదల నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసిన దళారుల వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి లంచం లేకుండా పథకాలు అందేలా బాధ్యత తీసుకుంటానన్నారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ కోరారు.
