CPI(ML) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి ‘మామిండ్ల రమేష్ రాజా’కు జన్మదిన శుభాకాంక్షలు
The public wave is winning the Palakurti soil సిద్ధాంతం రక్తంగా మారితే.. అక్షరం ఆయుధంగా మలిస్తే.. పోరాటం ఊపిరిగా పరిణమిస్తే.. ఆ నిలువెత్తు రూపమే మామిండ్ల రమేష్ రాజా. పాలకుర్తి చారిత్రక గడ్డపై ఉదయించి, విద్యార్థి ఉద్యమాల ఒడిలో రాటుదేలి, నేడు సి.పి.ఐ.(ఎం.ఎల్) లిబరేషన్ రాష్ట్ర సారథిగా అణగారిన వర్గాల ఆశాకిరణంగా నిలుస్తున్నారు. సామాజిక విప్లవకారుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి రోజే పుట్టిన ఈ అక్షర యోధుడు, కేవలం మైదానంలో నినదించే నాయకుడే కాదు, తన కలం పదునుతో వ్యవస్థలోని కుళ్లును కడిగేసే మేధావి కూడా. పదవుల కంటే ప్రజా హితమే పరమావధిగా సాగుతున్న రమేష్ రాజా జన్మదినం సందర్భంగా ఆ ‘పాలకుర్తి బిడ్డ’ అలుపెరగని ప్రస్థానంపై ప్రత్యేక కథనం…
The public wave is winning the Palakurti soil..!
వీరనారి ఐలమ్మ సాగించిన వీరోచిత పోరాటాలకు సాక్ష్యంగా నిలిచిన పాలకుర్తి గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ మట్టిలోనే ప్రతిఘటన ఉంది, ఆ గాలిలోనే చైతన్యం ఉంది. ఆ గడ్డపై పుట్టిన రమేష్ రాజా గారు చిన్నతనం నుంచే సమాజంలోని వైరుధ్యాలను గమనించారు. సామాన్య రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన, గ్రామీణ భారతంలోని కష్టాలను, కన్నీళ్లను చూసి చలించి.. పరిష్కారం కోసం వామపక్ష బాట పట్టారు. పాలకుర్తి బిడ్డగా ఆ ప్రాంతపు పోరాట వారసత్వాన్ని తన గుండెల్లో నింపుకుని జనారణ్యంలోకి అడుగుపెట్టారు.
The public wave is winning the Palakurti soil..!
రమేష్ రాజా రాజకీయ ప్రస్థానం నిబద్ధతకు నిలువుటద్దం. విద్యార్థి దశలోనే ఎర్రజెండా నీడన చేరి, ఫీజుల పోరాటాల నుండి ప్రాథమిక హక్కుల వరకు అనేక ఉద్యమాల్లో ముందుపీఠిన నిలిచారు. రాజీలేని పోరాట పటిమే ఆయనను సి.పి.ఐ.(ఎం.ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి చేర్చింది. అధికార భాష్యం ఏదైనా, ఆయన నిఘంటువులో ‘ప్రజలు’ అన్న పదానికే మొదటి ప్రాధాన్యత. నేడు రాష్ట్రస్థాయిలో అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి, ప్రజా సమస్యలపై పాలకులను నిలదీసే ధీశాలిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ఒక అరుదైన వ్యక్తిత్వం. ఒక చేత్తో ఎర్రజెండా పట్టి ఉద్యమిస్తూనే, మరో చేత్తో కలం పట్టి సమాజాన్ని ఆలోచింపజేస్తారు. రచయితగా ‘రమేష్ రాజా’ది ప్రత్యేక ముద్ర. ఆయన రాసిన పలు పుస్తకాలు కేవలం అక్షరాల కూర్పు కాదు, అవి సామాజిక విశ్లేషణలు. వ్యవస్థలోని అసమానతలను, రాజకీయాల్లోని వక్రీకరణలను ఎండగడుతూ ఆయన చేసిన రచనలు పాఠకుల్లో కొత్త చైతన్యాన్ని రగిలించాయి. సిద్ధాంతాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పడంలో ఆయన శైలి అద్వితీయం. రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, రమేష్ రాజా గారిలో ఏమాత్రం మార్పు రాలేదు. అధికారాలు, హోదాల కంటే స్నేహానికే ఆయన అధిక విలువనిస్తారు. నా వంటి ఎంతోమంది ఆత్మీయులకు ఆయన కేవలం ఒక నాయకుడే కాదు, ఒక మంచి మిత్రుడు, ఆపదలో అండగా నిలిచే సోదరుడు. పాలకుర్తి గడ్డపై మమకారాన్ని, మిత్రులపై ఆత్మీయతను ఆయన ఎన్నడూ మరువలేదు.
The public wave is winning the Palakurti soil..!
అంబేద్కర్ ఆశయాలను, మార్క్సిస్ట్ లెనినిస్ట్ విలువులను కలబోసుకున్న రమేష్ రాజా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన పోరాట ప్రస్థానం నిరంతరాయంగా సాగాలని ఆకాంక్షిద్దాం.
”ఆప్తమిత్రుడు, పాలకుర్తి గడ్డ ముద్దుబిడ్డ ‘మామిండ్ల రమేష్ రాజా’ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
– దారా
