CSI వర్సెస్ ప్రైవేట్ వ్యక్తుల మధ్య భూవివాదం..
పట్టణంలో ముదురుతున్న గందరగోళం
మత విద్వేశాలకు దారితీస్తున్న భూ పంచాయతి
సామాజిక మాధ్యమాల వేదికగా వాదోపవాదాలు…
‘Church site’ controversy a topic of discussion in Nekkonda : వరంగల్ జిల్లాలోని అతిపెద్దదిలో రెండవదిగా, నర్సంపేట నియోజకవర్గంలోనే ఏకైక రైల్వేస్టేషన్ కలిగి ఉండి, రవాణా సౌకర్యాలకు నెలవై, విస్తీర్ణంలో అతిపెద్ద మండల కేంద్రంగానూ, FCI గోదాములు కలిగిన నెక్కొండ పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాలకు అనుకూలంగా పరిసర మండలాలకు కేంద్రబిందువుగా ఉండటంతో రానున్న రోజుల్లో మున్సిపాలిటీ గాను, నియోజకవర్గంగానూ ‘నెక్కొండ’ అవతరించనుంది. దీంతో భూకబ్జాదారులు విలువైన భూములపై తమ పాగా వేసి, వివాదాలు సృష్టిస్తుండడంతో రోజురోజుకు నెక్కొండలో భూ సమస్యలు పేరుకుపోతున్నాయి. పట్టణ ప్రాంతంలోని ఖరీదైన ప్రభుత్వ భూములు, వివిధ దేవాలయాలు, చర్చి, మసీదులకు చెందిన ఏళ్లనాటి భూములపై కబ్జాకోరులు కన్నేస్తూ, రాజకీయ,తమ అంగబలంతో తప్పుడు దృవపత్రాలు సృష్టించి మరీ సంబంధిత అధికారులను సైతం పక్కదారి పట్టిస్తూ ధర్జాగా కబ్జా చేస్తున్నారు. అట్టి భూమిలో సైతం ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, కోట్లకు పడగలెడుతున్నారని మండల వాసులు వాపోతున్నారు.
‘Church site’ controversy a topic of discussion in Nekkonda..!?
పేరుకుపోతున్న భూసమస్యలు… రెచ్చిపోతున్న కబ్జాదారులు…
రానున్న రోజుల్లో ‘నెక్కొండ బంగారుకొండ’గా అవతరించనున్న నేపథ్యంలో మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూములపై కబ్జాదారులు కన్నేసి,ఎలాగైన దక్కించుకోవాలనే సంకల్పంతో తప్పుడు ధ్రువపత్రాలు సృష్టిస్తూ, అధికారులను సైతం తమ రాజకీయ, ధనబలంతో పక్కదారి పట్టించి యథేచ్ఛగా ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఇక ప్రైవేట్ స్థలాల విషయంలో స్థల యజమానికి పరిసర స్థల గెట్టుల విషయంపై ఇరువురికి గొడవలు సృష్టిస్తూ, వారి అవసరాలను ఆయుధంగా చేసుకుని, ఎలాగైన స్థలం పొందాలనే తమ వక్రబుద్ధిని ఉపయోగించి, భవిష్యత్తులో ఖరిదు కానున్న భూములను అడ్డగోలు ధరలకే ఆక్రమణ చేసుకుంటున్నారు. ఇట్టి విషయంపై సంభందిత ఉన్నతాధికారులు దృష్టి సారిస్తూ పూర్వాపరాలను పరిశీలిస్తూ, గత పహాణీల ఆధారంగా ప్రభుత్వ స్థలాలను గుర్తించి, హద్దులు కేటాయిస్తూ, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, కబ్జాకోరుల నుండి ప్రభుత్వ భూములను కాపాడుతూ,భూవివాదాలను ఎప్పటికప్పుడు కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
‘Church site’ controversy a topic of discussion in Nekkonda..!?
నెక్కొండలో ‘హాట్ టాపిక్’గా చర్చి స్థల వివాదం
నెక్కొండ మండల వ్యాప్తంగా CSI చర్చి వర్సెస్ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూవివాదం ‘హాట్ టాపిక్’గా మారి, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. CSI చర్చి సంఘం సభ్యులు వర్సెస్ ప్రైవేట్ వ్యక్తులు, ఆయా ఇరువురి సానుభూతిపరులు వాట్సాప్ వేదికగా పరస్పర వాదనలు చేసుకుంటున్నారు. పట్టణ పుర ప్రముఖులు సైతం ముచ్చటిస్తూ స్వాతంత్య్రానికి పూర్వం నెక్కొండలో రెవ.ఆరోను ఫాదర్ అనునతడు పాకాల ప్రాంతాన్ని మిషనుగా ఏర్పాటు చేసి, విద్య, వైద్య వసతులతో నాణ్యమైన విద్యను నిరుపేదలకు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల ఏర్పాటు కోసం 5ఎకరాల 29గుంటల భూమితో మొదటిగా ఫాదర్ బంగ్లాను 1939లో నిర్మాణం చేసి, అందులోనే సహజీవనం చేస్తూ,1940లో మిషన్స్ పాఠశాలను ప్రారంభించి, ఎందరో విద్యార్థులను ఉత్తములుగా దీర్చిదిద్దారని, నాటినుండి అట్టిస్థలం సి.ఎస్.ఐ చర్చి ఆధీనంలోనే ఉందంటూ అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.
‘Church site’ controversy a topic of discussion in Nekkonda..!?
నాన్చుడు ధోరణిలో అధికార యంత్రాంగం
మండల వ్యాప్తంగా ఉన్న పలు భూవివాద కేసుల్లో సంభందిత అధాకార యంత్రాంగం నాన్చుడు ధోరణి అవలంబిస్తూ, సమస్యను మరింత తీవ్రరూపం దాల్చే దిశగా అధికారుల పనితీరు అద్దం పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. భూతగాద విషయంలో గత రికార్డులను అనుసరిస్తూ, బాధితుల పక్షాన నిలవాల్సిన సంభంధిత రెవెన్యూశాఖ అధికారులు రికార్డులు లేవంటూ దాటవేయడం సబబు కాదని, రెవెన్యూ శాఖ కార్యాలయంలోనే లేని రికార్డులు ఇతర కార్యాలయంలో ఉంటాయ అని బాధితులు ప్రశ్నల ఝల్లు కురిపిస్తున్నారు. ఇట్టి రికార్డుల సాధనకు జిల్లా కలెక్టర్, హ్యూమన్ రైట్స్ కమిషన్(హెచ్.ఆర్.సి)లను సంప్రదించిన ఫలితం లేదని, రికార్డుల సాధన దేవుడికే తెలియాలని భూవివాద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘Church site’ controversy a topic of discussion in Nekkonda..!?
కలెక్టర్ గారూ….కణుకరించాలి…
మండల వ్యాప్తంగా ఉన్న పెండింగ్ భూసమస్యల దరఖాస్తులతో పాటు ప్రస్తుతం నెక్కొండ పట్టణంలో హాట్ టాపిక్ గా మారిన చర్చి స్థలం వివాదంపై జిల్లా కలెక్టర్ డా. సత్యశారద తక్షణమే స్పందించి గత భూ రికార్డులను అనుసరిస్తూ స్థల వివాదాన్ని పరిష్కరించాలి. లేని పక్షంలో మండల వ్యాప్తంగా మత విద్వేషాలు ప్రభలే అవకాశం ఉన్నందున తక్షణమే స్పందించి, సమస్య పరిష్కారం కోసం తగిన కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఈదునూరి మహేష్ సీనియర్ జర్నలిస్ట్ సెల్: 99491 34467
