- పెద్దగుట్ట వద్ద పలువురు రైతులు, గ్రామ పాలకవర్గ సభ్యుల ఆవేదన
- కొత్త క్రషర్ వద్దేవద్దంటూ నిరసన
- శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్లను వెంటనే మూసివేయాలని డిమాండ్
- శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ను సందర్శించిన
కాలుష్య నియంత్రణశాఖ అధికారులు
‘Crusher’ in cotton farming : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో గుట్టల విధ్వంసాన్ని పత్తిపాక గ్రామ పాలకవర్గ సభ్యులు, పలువురు రైతులు, వివిధ వృత్తులవారు వ్యతిరేకిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్ల వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, ప్రజల ఆరోగ్యం ముప్పులో పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం పెద్దగుట్ట వద్ద మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
’Crusher’ in cotton farming..!?
ప్రస్తుతం నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్లను వెంటనే మూసివేయాలని, పెద్దగుట్టపై కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న క్రషర్ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంత చుట్టుపక్కల ఉన్న భూములను ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వమంటూ పలువురు రైతులు తేల్చిచెప్పారు. ఈ నిరసనలో గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, పలువురు రైతులు పాల్గొన్నారు. గ్రామ పర్యావరణాన్ని, జీవనోపాధిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని సహించేది లేదని వారు స్పష్టం చేశారు. క్రషర్ల నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల పంట పొలాలు నాశనమవుతున్నాయని తెలిపారు. బోర్ బ్లాస్టింగ్ వల్ల ఇండ్లు పగుల్లుతేలుతున్నాయని, గుట్టల విధ్వంసం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘Crusher’ in cotton farming..!?
కాలుష్య నియంత్రణ శాఖ అధికారుల సందర్శన
ప్రజల ఆందోళనలు, ఫిర్యాదుల నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) అధికారులు పత్తిపాక పరిసర ప్రాంతాలను సందర్శించారు. ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ను, డాంబర్ ప్లాంటును పరిశీలించారు. అధికారులకు రైతులు, గ్రామ ప్రతినిధులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
