మేరుగు అశోక్ పిలుపు
Women should excel in all fields : వరంగల్ శివనగర్ 34, 35 డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మహిళలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మేరుగు అశోక్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలను సన్మానం చేసి చీరలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శివనగర్ మాజీ కార్పొరేటర్ కామిశెట్టి కోటేశ్వరమ్మ మరియు సీనియర్ నాయకురాలు మోహిని భాయ్ గటే పాల్గొన్నారు. విరు మాట్లాడుతూ మహిళలను ప్రోత్సహిస్తూ మహిళా దినోత్సవం జరపడం అభినందనీయమని మేరుగు అశోక్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కేక్ కట్ చేసుకొని ఒకరి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 35 పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి, పాలేపు శ్రీనివాస్, వెంగళదాస్ కృష్ణ, అంకతి అఖిల్, పిన్నిరెడ్డి ప్రణీత్ రెడ్డి, మహిళా నాయకులు మేరుగు సుహాసిని, గడ్డం భవాని, కోతి స్వరూప, బరుపాటీసువర్ణ, md సైదాబి, బర్ల కల్పనా, మినా కుమారి,పొన్నం సుచరిత, బండారు జ్యోతి, మార్తా ఉష, రాధిక, నాగమణి, రాజశ్రీ, స్వాతి, శోభ తదితరులు పాల్గొన్నారు
