Welcome to the times Salute to Jana Bandha : జైళ్లలో నేరస్తులుండని రోజుకోసం ఆసుపత్రులలో రోగులుండని రోజుకోసం రోడ్ల పై ప్రమాదాలు జరగని రోజు కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆయుధాగారాల్లో తుపాకులు కనిపించని రోజు కోసం అడవుల్లో వేటగాళ్లు కనిపించని రోజు కోసం చివరిగా… వార్తా పత్రికలలో వార్తలే కనిపించని రోజుకోసం నేను ప్రార్థిస్తున్నాను
Welcome to the times Salute to Jana Bandha : సమాజం పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ అన్నీ కలగలిసిపోయిన కథనాలను అందించే ప్రయ్నాతం మాది. చెప్పదలచినదీ వాడిగా, వేడిగా, సూటిగా ఒడుపుగా చెప్పే ప్రయత్నం మాది. కన్నీళ్ళూ, వేదనలూ నిండిన ఘటనలు, బయటి ప్రపంచానికి తెలియకుండా మరుగున పడ్డ వాస్తవికతను వార్తకథలుగా అందించడానికి “జన నిర్ణయం” ప్రయత్నిస్తోందని సగర్వంగా ప్రకటిస్తున్నాం. గుర్తించేవారు గుర్తిస్తూనే ఉన్నారు కక్షకట్టి కుట్రలు చేసేవారు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మా ఈ “జన నిర్ణయం” ప్రయాణం జన గొంతుకగా కొనసాగుతూనే ఉంది. “జన నిర్ణయం” దినపత్రికను “ఇది మన పత్రిక – జనం పత్రిక” అనేలా ఆదరిస్తున్న పాఠకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, రాజకీయ పక్షాలకు ఈ నూతన సంవత్సరం – 2026 సందర్బంగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
Welcome to the times Salute to Jana Bandha : జన నిర్ణయం పత్రిక ఎవరి పక్షం నిలవాలో.. ఎవరి పక్షం రాయాలో.. సృహ కలిగి తనదైన పాత్రను పోషించడానికి అక్షర సమరానికి సిద్దమవడం, అందుకనుగుణంగా ముందుకు సాగుతున్న నేపధ్యంలో భయపడుతూనే.. భయపెడుతూనే వెన్నుతట్టి భరోసానిస్తున్న సమాజ హితులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము ఏదో తిరుగేస్తున్నామని చెప్పడం లేదు. కానీ మా ప్రయత్నం నిక్కచ్చిగా చేస్తున్నామని “జన నిర్ణయం” పత్రిక తరుపున తెలుపుతున్నాం. ఈ విషయాన్ని ప్రారంభంలోనే ప్రకటించడం జరిగింది. అందుకనుగుణంగానే ముందుకు సాగుతున్న “జననిర్ణయం” పత్రికపై ఈర్ష్య ద్వేషం మిన్నంటి కక్షపూరిత కుట్రలు ఈ 2025 ఏడాదిలో సాగిన విషయం పాఠకులకు, ప్రజలకు, మిత్రులకు, శత్రువులకు, శ్రేయోభిలాషులకు తెలిసిన విషయమే. అయినప్పటికీ జన నిర్ణయం పత్రిక విశ్వాసనీయతను, అంకితభావాన్ని నమ్మి వెన్నంటి ఉన్న, ఉంటున్న వారందరూ భవిష్యత్తులోనూ మరింతంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
Welcome to the times Salute to Jana Bandha : “పరిశీలన తప్ప పక్షపాతం లేని, సమస్య తప్ప సంచలనం లేని, సన్నగిల్లిన సకలజనుల గొంతుకగా, ‘సంధి’ అంటూ లేని మంది పుత్రికగా స్పందించే “జన నిర్ణయం పత్రిక”గా మా నేతృత్వంలో కొనసాగుతున్న జన నిర్ణయం పత్రికపై సహజంగానే కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయని గుర్తించిన పాఠక లోకానికి వందనం”. పెట్టుబడికి పేదరికమే గాని, పెన్నుకు పేదరికం ఉండదు. అటువంటి పెన్ను నుండి జాలువారి విభిన్న రంగాలను, కదిలించిన కథనాలను మీ ముందు ఉంచిన విషయం మరువొద్దన గుర్తు చేస్తున్నాం. ఇలా విభిన్న రంగాల్లోని, సామాజిక సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక అంశాలను తడుతూ మంచిని మంచిగా, చెడును చేడుగా చెప్పే ప్రయత్నం “జన నిర్ణయం దినపత్రిక చేసిందని భావిస్తున్నాము. అలాగే మేము ఎవరికి పోటీకాదు, మాకు ఎవరితో పోటీ లేదు. ఉన్నదల్లా సమస్యను పరిశీలనాత్మక దృష్టితో చూసి, దానిపై స్పందించి, అట్టి కథనాన్ని పాఠకుల ముందు ఉంచి పరిష్కార మార్గాన్ని వెతికేందుకు కృషి చేసిందని, చేస్తూ ఉంటుందని తెలపడానికి ఎటువంటి సందేహం లేదు. పత్రిక ఎలా నడపాలో, పాఠకులకు ఏమి అందించాలో అనే “ఎరుక” సిన్సియారీటి, మాకు ఉంది. ఆశీర్వదించే మనసు మీకు ఉండాలని కోరుకుంటున్నాము. ఎప్పటి లాగే పత్రికని ఆదరిస్తారని ఆశిస్తున్న. చివరిగా మాపై కుట్రలు, కుతంత్రాలు ఈర్ష్య ధ్వేషాలు చరిత్రలో తప్పకుండా నిలుస్తాయనే ఎరుక మాకుంది. మా, నా కోర్ ఫిలాసఫీ అర్థం చేసుకునే అవకాశం లేనివారందరికీ నేను మా పత్రిక సహజంగానే శత్రువుగా ఉంటుంది. 2025లో అనేక చేదు అనుభవాలు, సంతృప్తకరమైన అంశాలు, కదిలించే వార్తాకథనాలు “జన నిర్ణయం” ఖాతాలో ఉన్నాయి. అనేక అనుభవాలతో ఈ ఏడాదికి విడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరలోకి అడుగీడుతున్న సందర్బంగా జన నిర్ణయం పాఠకులకు, ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
- రాజేందర్ దామెర ( దారా) editor in chief www.jananirnayam.com
