బతుకమ్మ – దసరా
ప్రత్యేక సంచిక – 2026
Not just a celebration of festivals…A literary tribute to Telangana’s culture..! బతుకమ్మ – దసరా పండుగల సందర్భంగా ‘జన నిర్ణయం’ వెలువరిస్తున్న ఈ ప్రత్యేక సంచిక తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవనవిధానాన్ని ప్రతిబింబించే ఒక చిన్న ప్రయత్నం. పండుగల సందడి మధ్య మన మూలాలను గుర్తుచేసుకోవడం, జానపద కళలు, పూల పండుగ వైశిష్ట్యం, మహిళల పాత్ర, పల్లె జీవన సౌందర్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడం ఈ సంచిక ప్రధాన ఉద్దేశం. పండుగలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా మన సంస్కృతిని భావితరాలకు అందించే వేదికలుగా నిలవాలి.
ఈ ప్రత్యేక సంచిక రూపకల్పనకు సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రకటనదాతలు, సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహమే మా బలం. ప్రజల గొంతుకగా, జనం పత్రికగా పత్రికగా ‘జన నిర్ణయం’ మరింత బాధ్యతతో ముందుకు సాగేందుకు మీ ఆదరణ స్ఫూర్తినిస్తుంది. మీ ముందుకు వస్తున్న ఈ ప్రత్యేక సంచికను ఆదరిస్తారని భావిస్తూ…
మీ అందరికీ ముందస్తు బతుకమ్మ–దసరా శుభాకాంక్షలు..!
– రాజేందర్ దామెర (దారా)
ఎడిటర్ – జన నిర్ణయం
jananirnayam2022@gmail.com

నోట్: పూర్తి సంచికను వీక్షించటానికి ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి
బతుకమ్మ – దసరా 2026 ప్రత్యేక సంచిక పిడిఎఫ్

