TPTF బాధ్యులు సునిల్ కుమార్..
Are one-time lessons just words..!? : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క పూట బడులు కేవలం మాటల వరకే, నామ మాత్రమే తప్ప, ప్రైవేటు యాజమాన్యాలు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అమలు పరచడం లేదని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు చంద్రగిరి సునిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరికులం (వార్షిక ప్రణాళిక)ప్రకారం , వేసవి తాపం దృష్ట్యా ప్రభుత్వం ఒక్క పూట బడులు నిర్వహించాలి అని చెప్పినప్పటికీ, జిల్లాలో కొన్ని యాజమాన్యాలు, వీటిని పట్టించు కోకుండా అటు విద్యార్థులను, టీచర్లను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు, ఈ సందర్భంగా సునిల్ కుమార్ మాట్లాడుతూ, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో దాదాపు గా అన్ని యాజమాన్యాలు ఒక్క పూట బడులు నిర్వహించకుండా, సెక్షన్ ల పేరుతో, పదవ తరగతి విద్యార్థులనే కాకుండా, వచ్చే సంవత్సరం విద్యార్థులను కూడా పాఠశాల లోనే ఉంచి , తరగతులు నిర్వహిస్తూ ,ఫీజుల కోసం తల్లిదండ్రులను పీడిస్తున్నారని, ఇంత చేస్తూ, టీచర్లకు 12 నెలల మాత్రం జీతం ఇవ్వకుండా, అడ్మిషన్ ల కోసం, ముందస్తుగా “టార్గెట్”లు పెట్టి,చేస్తేనే జీతం లేకుంటే లేదు అని అంటున్న,యాజమాన్యాల పైన ,జిల్లా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. సమావేశం లో టిపిటిఎఫ్ బాధ్యులు, రంజిత్, శివ, రాజు, శ్రవణ్ రెడ్డి, రాధ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
