- ఎమ్మెల్యే ఇలాకాలో హస్తంకు తప్పని పరాభవం..?
- 20 వార్డులు ‘BRS’ కు ఛాన్స్..?
10వార్డులకు పరిమితం కానున్న కాంగ్రెస్..? - ‘జన నిర్ణయం’ సర్వే రిపోర్ట్ వెల్లడి…
BRS leading in Bhupalapally Municipality : జయశంకర్ భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల నగారా ముగిసి, ఓటర్ల తీర్పు బాక్సుల్లో నిక్షిప్తమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్టున్నప్పటికీ.. భూపాలపల్లి ప్రజలు మాత్రం “అభివృద్ధి” వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 30 వార్డులకు గాను బీఆర్ఎస్ సుమారు 20 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా, కాంగ్రెస్ కేవలం 10 స్థానాలకే పరిమితం కానున్నట్లు ‘జన నిర్ణయం’ సర్వేలో వెల్లడైంది.
BRS leading in Bhupalapally Municipality..?
వార్డుల వారీగా నిర్దిష్ట అంచనాలు, రాజకీయ విశ్లేషకులు, పోలింగ్ సరళి ఆధారంగా ‘జన నిర్ణయం’ క్షేత్రస్థాయి రిపోర్ట్ వెల్లడైన అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ (BRS) : 1, 3, 5, 6, 8, 9, 12, 14, 15, 17, 18, 20, 21, 23, 25, 26, 28, 29, 30, 13 వార్డుల్లో గెలుపొందే అవకాశం ఉండగా…కాంగ్రెస్ (INC) : 2, 4, 7, 10, 11, 16, 19, 22, 24, 27 వార్డల్లో గెలుపొందే అవకాశం ఉందని జన నిర్ణయం సర్వేలో వెల్లడైంది. 30 వరకు ఉన్న వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకపక్షంగా దూసుకుపోయారని, 1, 5, 8 వార్డుల్లో భారీ మెజారిటీ ఖాయమని సమాచారం. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభావం ఉన్న 10, 11, 19 వార్డుల్లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశం ఉంది.
ముఖ్యంగా సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ వైపు నిలబడటం ఆ పార్టీకి అతిపెద్ద ప్లస్ పాయింట్.గత బీఆర్ఎస్ పాలనలో భూపాలపల్లి పొందిన మున్సిపల్ హోదా, ప్రత్యేక నిధులపై ప్రజలు సానుకూలంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చాక స్థానిక సమస్యలను పట్టించుకోలేదనే ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తిని బీఆర్ఎస్ క్యాష్ చేసుకుంది. మరోవైపు అంతర్గత విభేదాలు లేని బీఆర్ఎస్ కేడర్ ప్రతి ఇంటికీ వెళ్లి “కారు” గుర్తు ప్రాముఖ్యతను వివరించడం ఫలితాలపై ప్రభావం చూపిందని అంచన.
BRS leading in Bhupalapally Municipality..?
బలమైన కేడర్.. పక్కా ప్రణాళిక
నామినేషన్ల ప్రక్రియ నుంచే బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఇక్కడ ప్రచారం నిర్వహించడం కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా భావించే కొన్ని వార్డుల్లో కూడా బీఆర్ఎస్ చొచ్చుకెళ్లడం గమనార్హం. ఇక వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పక్కాగా వ్యవహరించింది. ముఖ్యంగా అసంతృప్త నేతలను బుజ్జగించడంలో సక్సెస్ అయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యే స్థానిక సమస్యల పరిష్కారంలో వేగం పెంచలేదనే భావన ఓటర్లలో ఉండటం ప్రతిపక్షానికి వరంగా మారింది.
BRS leading in Bhupalapally Municipality..?
బీఆర్ఎస్ ముందంజలో ఉండటానికి మరో ప్రధాన కారణాలను పరిశీలిస్తే గత పదేళ్లలో భూపాలపల్లి పట్టణంలో జరిగిన మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల విస్తరణ, పార్కుల అభివృద్ధి ఓటర్లను బీఆర్ఎస్ వైపు ఆకర్షించినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించిన సమీకృత కలెక్టరేట్, వంద పడకల ఆసుపత్రి, అంతర్గత రహదారులు పట్టణ ఓటర్లలో ముద్ర వేశాయి. దీంతో “పని చేసిన వారికే ఓటు” అనే నినాదం క్షేత్రస్థాయిలో పనిచేసింది. ఇక అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కాంగ్రెస్ ఇచ్చిన కొన్ని స్థానిక హామీలు నెరవేరకపోవడం, అభివృద్ధి పనుల్లో వేగం తగ్గడం బీఆర్ఎస్కు సానుకూలంగా మారింది. పట్టణ పరిధిలో ‘ఆసరా’ పింఛన్లు, ‘కళ్యాణ లక్ష్మి’ వంటి పథకాల లబ్ధిదారులు పార్టీకి అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇక సింగరేణి ప్రాంతం కావడంతో కార్మిక వర్గం ఎక్కువగా బీఆర్ఎస్ అనుబంధ సంఘాల వైపు మొగ్గు చూపడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం అయ్యింది. మరోవైపు ఐక్యతతో కూడిన ప్రచారం కూడా కూడా బీఆర్ఎస్ కు అనుకూలించింది. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, టిక్కెట్ల కేటాయింపులో అసంతృప్తి బీఆర్ఎస్కు ప్లస్ పాయింట్‌గా మారాయి. బీఆర్ఎస్ నాయకత్వం అంతా ఒక్కతాటిపై నిలిచి ప్రచారం చేయడం ఓటర్లలో నమ్మకాన్ని కలిగించింది.
మున్సిపాలిటీలోని 30 వార్డులలో విశ్లేషణ చేయగా, 18 నుంచి 20 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ కంటే చాలా ముందు వరుసలో ఉన్నారు. కొన్ని వార్డులలో మెజారిటీ వేలల్లో ఉండే అవకాశం ఉందని పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. దీనితో మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం బీఆర్ఎస్కు సునాయాసంగా లభించనుంది.
దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట ప్రతిపక్ష బీఆర్ఎస్ జెండా పాతడం అంటే అది ఆ పార్టీ కేడర్ సాధించిన విజయంగానే భావించాలి. ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితం భూపాలపల్లి రాజకీయాల్లో సరికొత్త మలుపు కానుంది. ఈ అంచనాల ప్రకారం ఛైర్మన్ పీఠం బీఆర్ఎస్ దక్కించుకున్నట్లైతే భవిష్యత్ ఎన్నికలకు ఇది ఒక దిక్సూచిగా మారే అవకాశం లేకపోలేదు.
