- ఎస్సై గోవర్ధన్
Teachers are the guides for students : పిఆర్టియు నల్లబెల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో నల్లబెల్లి సబ్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా ఉంటూ, వారిని చెడు అలవాట్లకు దూరంగా ఉండేటట్లు చూస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల అధ్యక్షుడు ఉడుత రాజేందర్, ప్రధాన కార్యదర్శి బానోత్ కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎస్ సతీష్ కుమార్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు పురం బద్రీనాథ్, లడే రవీందర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కందకట్ల నాగరాజు, ఉపాధ్యాయులు సునీల్ తదితరులు పాల్గొన్నారు.
