- పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్
Wear a helmet – ride safely : రోడ్డు భద్రత వారోత్సవలలో భాగంగా, వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో, ఎస్సై దూలం పవన్ కుమార్ వాహనదారులకు, రోడ్డు భద్రత ప్రమాణాల గురించి, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో, పోలీస్ కానిస్టేబుల్ వల్లల రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది, వాహనదారులు, తదితరులు, పాల్గొన్నారు.
