
- ప్రతి పనికో రేటుతో యధేచ్ఛగా సాగుతున్న దందా..!!
- చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
- అధికారులకు తెలిసినా అంతా కామనే అంటున్న నటకిరీటాలు….
“MVI” bust in the transport department : వరంగల్ రవాణాశాఖలో చేతివాటం రాజ్యమేలుతున్నది. ఎంవీఐల బరితెగింపు రోజురోజుకూ మితిమీరడం బహిరంగ రహస్యంగా మారింది. అంతా తెలిసినా ఉన్నతాధికారులు సైతం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నటశోభన కిరీటాలదే రాజ్యంగా ఆ కార్యాలయం మారిందనే ఆరోపణల్లో నిజం లేకపోలేదు. ఆ కార్యాలయాన్ని ఏసేవ కోసం వచ్చినా ప్రతీ పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ దందా సాగించడం ఆ ఎంవీఐలకే చెల్లిందని పలువురు వాపోతున్నారు.
“MVI” bust in the transport department
మరోవైపు వాహనదారులకు ఏ పని కావాలన్న అధికారులు నియమించుకున్న ప్రైవేట్ అసిస్టెంట్ లను కలిసి వారు అడిగిన మొత్తం సమర్పించుకోవాలని లేదంటే వారి పని మూలన పడుతుందని నెలల తరబడి తిరిగినా పని కాదని చివరికి ప్రైవేట్ అసిస్టెంట్ లను కలిస్తేనే పని అవుతుందని విశ్వసనీయ సమాచారం.
“MVI” bust in the transport department
- ఏ సేవకు ఎంత లంచం.. అందులో నుండి ఎవరికి ఎంత..?
వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించే ఫీజు కంటే కూడా ముడుపుల రూపంలో అధికారులకు చెల్లించే ఫీజు అధికం అని తెలుస్తోంది. వాహనదారులు ఏ సేవకు ప్రభుత్వానికి ఎంత ఫీజు చెల్లిస్తారు..అదే సేవకు ఆ కార్యాలయంలో ఎంవీఐల కనుసన్నల్లోని ప్రైవేట్ అసిస్టెంట్ లకు లంచాలు ఎంత సమర్పించుకుంటారు. కొన్ని వివరాలు…
“MVI” bust in the transport department
- లైసెన్స్ లకు ప్రభుత్వ ఫీజు వివరాలు….లంచాల వివరాలు..
లెర్నింగ్ లైసెన్స్ కు: ప్రభుత్వ ఫీజు రూ. 450 లంచం : రూ. 1000 అందులోనుండి ఎంవీఐకి రూ. 900,
పర్మినెంట్ లైసెన్స్ కు ప్రభుత్వ ఫీజు రూ. 1335 లంచం : రూ. 1500 ఈ మొత్తం ఎంవీఐ కే అనే ఆరోపణలు లేకపోలేదు.
హెవీ లైసెన్స్ కు ప్రభుత్వ ఫీజు రూ. 1600 లంచం : రూ. 3300 ఈ మొత్తం ఎంవీఐకే
ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ కు:ప్రభుత్వ ఫీజు రూ. 1335 లంచం : రూ. 2100 ఈ మొత్తం కూడా ఎంవీఐకే
కొత్త వాహన రిజిస్ట్రేషన్ లు వీటికి ప్రభుత్వ ఫీజు ఉండదు లంచాల వివరాలు…
- నాన్ ట్రాన్స్ పోర్ట్ (సొంతవాహనాలు) :
టూ వీలర్ కు ప్రభుత్వ ఫీజు లేదు – లంచం : రూ. 450 అందులో నుంచి ఎంవీఐకి రూ. 250
కార్లకు : ప్రభుత్వ ఫీజు లేదు – లంచం : రూ. 1000 అందులో నుండి ఎంవీఐ రూ. 600
3వీలర్స్ రిక్షా ప్యాసింజర్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 3వేలు అందులో నుండి ఎంవీఐ కి రూ. 600
LMV గూడ్స్ కు: ప్రభుత్వ ఫీజు లేదు
లంచం : రూ. 1800 అందులోనుండి ఎంవీఐకి రూ. 1200
ట్రాక్టర్ ట్రాలీ కి ప్రభుత్వ ఫీజు లేదు. లంచం : రూ. 2900 అందులోనుండి ఎంవీఐ కి రూ. 1500
మోటార్ క్యాబ్ కు: ప్రభుత్వ ఫీజు లేదు. లంచం : రూ. 4600 అందులో నుండి ఎంవీఐ కి రూ. 1400
మీడియం గూడ్స్ వెహికిల్ కు: ప్రభుత్వ ఫీజు లేదు. లంచం : రూ. 5200 అందులో నుండి ఎంవీఐ కి రూ. 2200
హెవీ గూడ్స్ వెహికిల్ కు: ప్రభుత్వ ఫీజు లేదు. లంచం : రూ. 10,700 అందులో నుండి ఎంవీఐకి రూ. 5500
జేసీబీ కి ప్రభుత్వ ఫీజు లేదు. లంచం : రూ. 5700 అందులోనుండి ఎంవీఐకి రూ. 2400
హార్వెస్టర్ కు ప్రభుత్వ ఫీజు లేదు. లంచం : రూ. 9900 అందులోనుండి ఎంవీఐ కి రూ. 2400
“MVI” bust in the transport department
- ఫిట్ నెస్ లు.. ప్రభుత్వ ఫీజు… లంచాల వివరాలు…
ఆటో రిక్షా ఫిట్ నెస్ కి ప్రభుత్వ ఫీజు రూ. 600 లంచం : రూ. 500 అందులోనుండి ఎంవీఐ కి రూ. 400
LMV గూడ్స్ ఫిట్ నెస్ కు:ప్రభుత్వ ఫీజు రూ. 800 లంచం : రూ. 1100 అందులోనుండి ఎంవీఐకి రూ. 1000
ట్రాక్టర్ ట్రాలీ ఫిట్ నెస్ కు ప్రభుత్వ ఫీజు రూ. 800 లంచం : రూ. 1500 అందులోనుండి ఎంవీఐ కి రూ. 1400
మోటార్ క్యాబ్ ఫిట్ నెస్ కు :ప్రభుత్వ ఫీజు రూ. 800 లంచం : రూ. 1000. అందులోనుండి ఎంవీఐ కి రూ. 900
మీడియం గూడ్స్ వెహికిల్ ఫిట్ నెస్ కు. ప్రభుత్వ ఫీజు రూ. 1000 లంచం : రూ. 1900 అందులో నుండి ఎంవీఐకి రూ. 1800
హెవీ గూడ్స్ వెహికిల్ ఫిట్ నెస్ కు ప్రభుత్వ ఫీజు రూ. 1000. లంచం : రూ. 2300 అందులో నుండి ఎంవీఐకి రూ. 2200
“MVI” bust in the transport department
నాన్ ట్రాన్స్ పోర్ట్ ( సొంత వాహనాలు )ల్లోనూ జరిగే తతంగంతో పాటు ఎంవీఐల మరోకోణం, డిటివో, ఏవో, క్లర్క్ ల వాటా కూడా ఏంత
వివరాలు త్వరలో “జన నిర్ణయం” సంచికలో…..