
- కలెక్టర్ సైతం దృష్టి సారించని వైనం..!
- అంతా తానై రాజ్యమేలుతున్న ఓ “ఏంవీఐ”..!!
- నట శోభనుడికి శోభన్ సామ్రాట్ అవార్డు ఇవ్వాల్సిందేనంటూ కార్యాలయ వర్గాల్లో గుసగుసలు…
MVI is a favorite in Warangal RTA : వరంగల్ రవాణాశాఖలో ఓ ఏంవీఐ ఇష్టారాజ్యం సాగుతున్న విషయం బహిరంగ రహస్యంగా మారింది. ఇట్టి విషయంలో “జన నిర్ణయం” వరుస కథనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కలెక్టర్ సైతం దృష్టి సారించపోవడంతో సదరు ఏంవీఐ మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. అంతా తానై రాజ్యమేలుతున్న ఆ “ఏంవీఐ” నట శోభనుడికి శోభన్ సామ్రాట్ అవార్డు ఇవ్వాల్సిందేనంటూ కార్యాలయ వర్గాల్లో గుసగుసలు వినిపించడం గమనార్హం.
MVI is a favorite in Warangal RTA
అయితే ఇట్టి అంశంలో డిటిసికి తెలిసినా… ఏకంగా జిల్లా కలెక్టర్ కు తెలిసినా నో ప్రాబ్లమ్ అంటూ సదరు ఎంవీఐ ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంతకంటే ఎక్కువగా దూకుడు పెంచినట్లు కార్యాలయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రయివేటు అసిస్టెంట్లకు మరింత భరోసా ఇస్తూ వసూళ్ల పర్వాన్ని పెంచడం గమనార్హం.
MVI is a favorite in Warangal RTA
అయితే విధుల పట్ల నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న “ఆర్టీవో” గందం లక్ష్మీని ప్రభుత్వానికి సరెండర్ చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రస్తుతం అక్రమ వసూళ్ళను ప్రోత్సహిస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆర్టీఏ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఇంఛార్జి డిటివో వ్యవహారం పట్ల ఎలాంటి చర్యలు చేపడుతారో వేచిచూడాల్సిందేనని పలువురు భావిస్తున్నారు.
MVI is a favorite in Warangal RTA
మరోవైపు ఏజెంట్ ల వద్దకు వచ్చే వాహనదారుల నుండి ప్రతీ సేవకు అదనంగా వసూళ్లు చేసే ఏజెంట్ లు ఎంవీఐ లు నియమించుకున్న” ప్రైవేట్ అసిస్టెంట్” కు లంచాలు ఇచ్చి వాహనదారులు తీసుకువచ్చే పత్రాలపై ఓ కోడ్ వేపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పత్రాలపై వారి అసిస్టెంట్ ల కోడ్ చూసిన వెంటనే సదరు ఎంవీఐ లు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఓకే చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ పత్రాలపై ప్రైవేట్ అసిస్టెంట్ కోడ్ కనుక లేకపోతే రకరకాల కొర్రీలు పెట్టి వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు.
MVI is a favorite in Warangal RTA
ఇలాంటి అనేక ఉదాహరణలు బహిర్గతం అవుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టి సారించకపోవడం ఆ ఏంవీఐ కి బలం చేకూల్చినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.